Pa Pa: ‘పా..పా’ మూవీ ట్రైలర్ వదిలిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:45 AM

కవిన్, అపర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్ మరియు విటివి గణేష్ ముఖ్య పాత్రల్లో గణేష్ కె బాబు దర్శకత్వంలో ఎస్ అంబేత్ కుమార్ సమర్పణలో తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘దా..దా..’. ఇప్పుడీ మూవీని నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత ఎం. ఎస్. రెడ్డి తెలుగులో ‘పా..పా..’ గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బ్లాక్‌‌బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన చేతుల మీదుగా నిర్మాత విడుదల చేశారు.

Pa Pa: ‘పా..పా’ మూవీ ట్రైలర్ వదిలిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్
Pa Pa Movie Trailer Launch

కవిన్ (Kavin), అపర్ణ దాస్ (Aparna Das), మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్ మరియు విటివి గణేష్ ముఖ్య పాత్రల్లో గణేష్ కె బాబు (Ganesh K Babu) దర్శకత్వంలో ఎస్ అంబేత్ కుమార్ సమర్పణలో తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘దా..దా..’ (Da Da). ఇప్పుడీ మూవీని నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత ఎం. ఎస్. రెడ్డి (MS Reddy) తెలుగులో ‘పా..పా..’ (Pa Pa) గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బ్లాక్‌‌బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన (Trinadha Rao Nakkina) చేతుల మీదుగా నిర్మాత విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం డైరెక్టర్ త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. సాధారణంగా ప్రతి సినిమాకి ట్రైలర్ చూపిస్తే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటాం. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దా..దా..’. తెలుగులో ‘పా..పా..’గా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ దా..దా.. సినిమాని తమిళంలో ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రెడ్డి నాకు చూపించడం జరిగింది. దా..దా.. అంటే నాన్న తెలుగులో పా..పా.. అంటే ఏంటి అన్నాను. పా..పా.. అంటే కూడా నాన్న అన్నారు. ఈ సినిమా రైటర్ మరియు డైరెక్టర్ గణేష్ కె బాబు ప్రతి సీను చాలా బాగా రాసుకున్నాడు. ఏదైతే రాసుకున్నాడో ఎగ్జాక్ట్‌గా అదే తీశాడు. తన రైటింగ్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఇది ఒక నాన్న కథ మాత్రమే కాదు ఒక స్నేహితుడు కథ, ఒక ఒక అమ్మ కథ, ఒక లవర్ కథ. రెండు షేడ్స్‌లో హీరో కవిన్ పాత్ర తీరు చాలా బాగుంది. ఈ సినిమా నేను చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. నాకు చాలా నచ్చిన సినిమా ఇది. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లో చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. (Trinadha Rao Nakkina Launches Pa Pa Trailer)


Pa-Pa-Movie.jpg

నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ట్రైలర్‌ను విడుదల చేసిన కమర్షియల్ డైరెక్టర్, ‘ధమాకా, నేను లోకల్’ వంటి చిత్రాలను దర్శకత్వం వహించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో ‘సాహసం చేయరా డింభక’ అనే మూవీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ ‘పా..పా..’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. అతి త్వరలో ఉగాది శుభాకాంక్షలతో ‘ఆత్రేయపురం ఆణిముత్యం’ అనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నాం. ఈ మూవీతో మణికంఠ అనే ఒక కొత్త దర్శకుని పరిచయం చేయబోతున్నాను. ఈ ‘దా..దా..’ సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను.. అప్పటికీ 70 శాతం ఫుల్స్‌తో ఆడుతోంది. ఈ మూవీ చూసిన వెంటనే నచ్చి యుఎస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ శ్రీకాంత్, శశాంక్‌కి కాల్ చేసి చెప్పాను.. ఒక మంచి సినిమా చూశాను అని. అలా చెప్పగానే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఈ సినిమాని తెలుగులో తీసుకొద్దామన్నారు. అతి త్వరలో ఈ సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నాము. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని భావిస్తున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Gaami: ‘గామి’ ట్విట్టర్ టాక్.. విశ్వక్ సేన్‌కి హిట్ పడినట్టేనా?

*************************

*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

****************************

Updated Date - Mar 08 , 2024 | 11:45 AM