Osey Arundhati: ‘ఒసేయ్ అరుంధతి’ రెడీ అవుతోంది.. స్టోరీ లైన్ ఇదే

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:51 PM

వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

Osey Arundhati: ‘ఒసేయ్ అరుంధతి’ రెడీ అవుతోంది.. స్టోరీ లైన్ ఇదే
Osey Arundhati Movie Still

వెన్నెల కిషోర్ (Vennela Kishore), కమల్ కామరాజు (Kamal Kamaraju), మోనికా చౌహాన్ (Monika Chauhan) ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’ (Osey Arundhati). విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి (Guduru Pranay Reddy) మాట్లాడుతూ.. కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.


Arundhati.jpg

చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ (Vikrant Kumar) మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలు అరుంధతి.. తన పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Amitabh Bachchan: ఒకవైపు ఆస్పత్రిలో అంటూ వార్తలు.. బిగ్ బి చూడండి ఏం చేస్తున్నారో..

************************

*Rathnam: ‘డోంట్ వర్రీ రా చిచ్చా’.. మాస్ బీట్ అదిరింది

************************

*Niharika: అది మూర్ఖ‌త్వ‌మే.. మళ్లీ పెళ్లి చేసుకుంటా కానీ..

***************************

*Venkatesh Daughter: ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం.. ఫొటోలు వైరల్

**************************

Updated Date - Mar 16 , 2024 | 01:51 PM