Amitabh Bachchan: ఒకవైపు ఆస్పత్రిలో అంటూ వార్తలు.. బిగ్ బి చూడండి ఏం చేస్తున్నారో..

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:21 PM

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారని.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనేలా శుక్రవారం బీటౌన్‌లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన కాలిలో క్లాట్‌ ఉండటం వల్ల యాంజియోప్లాస్టీ చేయబోతున్నారనేలా మీడియా కథనాలు ప్రచురించింది. తాజాగా ఈ వార్తలపై అమితాబ్ బచ్చన్ స్పందించారు.

Amitabh Bachchan: ఒకవైపు ఆస్పత్రిలో అంటూ వార్తలు.. బిగ్ బి చూడండి ఏం చేస్తున్నారో..
Amitabh Bachchan

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) అస్వస్థతకు గురయ్యారని.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనేలా శుక్రవారం బీటౌన్‌లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన కాలిలో క్లాట్‌ ఉండటం వల్ల యాంజియోప్లాస్టీ చేయబోతున్నారనేలా మీడియా కథనాలు ప్రచురించింది. తాజాగా ఈ వార్తలపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, తను బాగానే ఉన్నట్లుగా బిగ్ బి (Big B) స్పష్టం చేశారు.

తాజాగా బిగ్ బి ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL) ఫైనల్స్‌కు హాజరై అక్కడ సందడి చేశారు. బిగ్ బి‌ని అక్కడ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఒక వైపు హాస్పటల్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. మీరేమో ఇక్కడ.. అంటూ మీడియా వారు అమితాబ్‌ని ప్రశ్నించగా.. ‘నేను బాగున్నాను.. నాకేం కాలేదు. నాకు అనారోగ్యమని వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌’ అని సమాధానం ఇచ్చారు. స్వయంగా బిగ్ బినే తన ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంతో.. ఆయనకు అనారోగ్యం అని వస్తున్న వార్తలకు బ్రేక్ వేసినట్లయింది. ఇక ఐఎస్‌పీఎల్‌ ఫైనల్స్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి అమితాబ్ సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఐఎస్‌పీఎల్‌‌లో అమితాబ్ బచ్చన్ ముంబై జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. (Amitabh Bachchan about His Health)


Sachin.jpg

సినిమా విషయాలకు వస్తే.. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రభాస్ - నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘కల్కి 2898AD’ (Kalki 2898 AD) చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై రీసెంట్‌గా బిగ్‌బి ప్రశంసలు కురిపించారు. అలాగే కోలీవుడ్‌లో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘తలైవా 170’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పారు. బాలీవుడ్‌లో మరికొన్ని సినిమాలకు ఆయన సైన్ చేసి ఉన్నారు.

Big-B.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Rathnam: ‘డోంట్ వర్రీ రా చిచ్చా’.. మాస్ బీట్ అదిరింది

************************

*Niharika: అది మూర్ఖ‌త్వ‌మే.. మళ్లీ పెళ్లి చేసుకుంటా కానీ..

***************************

*Venkatesh Daughter: ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం.. ఫొటోలు వైరల్

**************************

Updated Date - Mar 16 , 2024 | 01:21 PM