100 Crores: నిర్మాతగా సంగీత దర్శకుడు.. వాస్తవ సంఘటనతో ‘100 క్రోర్స్’.. ఫస్ట్ లుక్ ఇదే

ABN , Publish Date - May 07 , 2024 | 04:49 PM

యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌‌ను బేస్ చేసుకుని, వినోదభరితంగా తెరకెక్కిన చిత్రం ‘100 క్రోర్స్’. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా ఎస్.ఎస్. స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి రచయిత, దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

100 Crores: నిర్మాతగా సంగీత దర్శకుడు.. వాస్తవ సంఘటనతో ‘100 క్రోర్స్’.. ఫస్ట్ లుక్ ఇదే
100 Crores First Look Poster Launch Event

యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌‌ను బేస్ చేసుకుని, వినోదభరితంగా తెరకెక్కిన చిత్రం ‘100 క్రోర్స్’ (100 Crores). దివిజా కార్తీక్ (Divija Karthik), సాయి కార్తీక్ (Sai Karthic) నిర్మాతలుగా ఎస్.ఎస్. స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి (Virat Chakravarthy) రచయిత, దర్శకుడు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి. జి సహ నిర్మాతగా, వెంకట్ సుధాకర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ చేతుల మీదుగా మేకర్స్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

*Aditi Rao Hydari: అతని వల్లే మార్పు.. ప్రేమపై నమ్మకం పెరిగింది


అనంతరం నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘100 క్రోర్స్’ అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాయి కార్తీక్ రెండు, మూడేళ్ల క్రితం సినిమా తీస్తున్నానని చెప్పాడు. కొత్త దర్శకుడికి ఆల్ ది బెస్ట్. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని తెలపగా.. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డీమానిటైజేషన్‌లో వంద కోట్ల చుట్టూ తిరిగే కథ అని, ఫస్ట్ టైం సినిమాను నిర్మిస్తున్నానని సాయి కార్తీక్ గారు చెప్పారు. ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి వస్తున్న చేతన్‌కు స్వాగతం. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. వీర శంకర్ మాట్లాడుతూ.. ‘డీమానిటైజేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. విరాట్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సాయి కార్తీక్ ఈ చిత్రంతో మంచి లాభాలను రాబట్టుకోవాలి. కన్నడ నటుడు చేతన్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలి. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అని తెలిపారు. మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. సాయి కార్తీక్ గారంటే నాకు చాలా ఇష్టం. అర్ధరాత్రి ఫోన్ చేసి అడిగినా ట్యూన్స్ ఇస్తుంటారు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. చేతన్‌కు తెలుగులో ఇది మొదటి సినిమా. ఈ చిత్రయూనిట్‌ను తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలి. పెద్ద విజయాన్ని అందించాలని కోరారు. (100 Crores First Look Poster Launch)


Poster.jpg

సాయి కార్తీక్ (Sai Karthic) మాట్లాడుతూ.. ‘2016లో జరిగిన యథార్థ కథ. కరోనా తరువాత ఈ పాయింట్‌ను అనుకుని ప్రాజెక్ట్ చేశాం. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని అన్నారు. హీరో చేతన్ మాట్లాడుతూ.. ‘తెలుగు పరిశ్రమలోకి హీరోగా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సాయి కార్తీక్ గారితో నాకు పదిహేనేళ్ల నుంచి బంధం ఉంది. ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, మా సినిమాను పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - May 07 , 2024 | 04:56 PM