22 ఏండ్ల త‌ర్వాత.. క‌లుసుకున్న మ‌న్మ‌థుడు జంట‌

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:16 PM

నాగార్జున, సొనాలి బింద్రే, అన్షు కాంబినేష‌న్‌లో వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం మ‌న్మ‌ధుడు. ఈ చిత్రంలో రెండో క‌థానాయిక‌గా మహి పాత్ర‌ చేసిన అన్షు చాలా మందిని బాగా ఆట్రాక్ట్ చేసింది. లర్వాత పెల్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయిన ఈ నటి తాజాగా నాగార్జునను కలిసింది.

22 ఏండ్ల త‌ర్వాత.. క‌లుసుకున్న మ‌న్మ‌థుడు జంట‌
nag anshu

నాగార్జున (Nagarjuna Akkineni), సొనాలి బింద్రే, అన్షు (Anshu Ambani) కాంబినేష‌న్‌లో వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం మ‌న్మ‌ధుడు (Manmadhudu). విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త్రివిక్ర‌మ్ ర‌చ‌న , దేవీశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ఈ సినిమాను ఓ స్థాయిలో నిల‌బెట్టాయి. ఇప్ప‌టికీ ఈ సినిమాలోని పాట‌లు తెలుగు వారి ఇండ్ల‌లో ఏదో స‌మ‌యంలో వినిపిస్తూనే ఉంటాయి.

anshu nag.jpeg

ముఖ్యంగా ఈ చిత్రంలో రెండో క‌థానాయిక‌గా మహి పాత్ర‌ చేసిన అన్షు (Anshu Ambani) చాలా మందిని బాగా ఆట్రాక్ట్ చేసింది. ఈ సినిమా త‌ర్వాత సినిమా అవ‌కాశాలు బాగానే త‌లుపు త‌ట్టిన‌ప్ప‌టికీ కేవ‌లం మూడు సినిమాలే చేసి సినిమాల‌కు గుడ్ బై చెప్పింది. ప్ర‌భాస్‌తో రాఘ‌వేంద్ర‌, భూమిక న‌టించిన‌ మిస్స‌మ్మ‌లో అతిథి పాత్ర‌లో, త‌మిళంలో ప్ర‌శాంత్‌తో ఒక సినిమా మాత్ర‌మే చేసింది.

nagarjuna.jpeg

అనంత‌రం సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో ప‌ల‌క‌రించినా సినిమాల వైపు చూడ‌లేదు. సాగ‌ర్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుని లండ‌న్‌లో సెటిలవ‌గా వారికి ఓ పాప, బాబు ఉన్నారు.


nag.jpegతాజాగా ఇటీవ‌లే ఇండియాకు వ‌చ్చిన అన్షు త‌న స్నేహితుల‌ను క‌లుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో త‌న ఫ్రెండ్స్ ఇచ్చిన పార్టీలో నాగార్జున‌,అమ‌ల కూడా పాల్గొన‌గా అక్క‌డ అన్షు త‌న సినిమా మ‌న్మ‌థుడు (Manmadhudu) హీరో నాగార్జున (Nagarjuna Akkineni) ను క‌లిసింది.

anshu.jpeg

ఈ సంద‌ర్భంగా వారు మ‌న్మ‌థుడు చిత్రం నాటి జ్ఞ‌ప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Mar 04 , 2024 | 03:16 PM