Love Me: హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి పాట పాడిన నిర్మాత దిల్ రాజు

ABN , Publish Date - Mar 30 , 2024 | 08:36 PM

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో‌హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి ‘రావాలి రా’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

Love Me: హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి పాట పాడిన నిర్మాత దిల్ రాజు
Love Me Song Launch Event

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకుడు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. శనివారం ‘రావాలి రా’ (Raavaali Raa) అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరోయిన్ వైష్ణవితో కలిసి నిర్మాత దిల్ రాజు ఈ పాటను హమ్ చేశారు.

అనంతరం దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ‘‘ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవి చేత కీరవాణిగారు ఈ పాటను పాడించారు. నేను కూడా ఇంతలా హమ్ చేశానంటే.. అందరూ ఈ పాటను హమ్ చేస్తూనే ఉంటారు. కీరవాణి ఎంతో మెలోడియస్‌గా ఈ పాటను ట్యూన్ చేశారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఓ కొత్త కథ విన్న ఫీలింగ్ అనిపించింది. చాలా ఎగ్జైటింగ్‌తో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అన్నీ కొత్త కథలు దొరకవు. కొన్ని సార్లు సేఫ్ గేమ్ ఆడుతుండాలి. ఇది చాలా కొత్త కథ అని మాత్రం నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఊహించలేరు. సినిమా అంతా అయ్యాకే ఆడియెన్స్‌కు అర్థం అవుతుంది. ఇది చాలా న్యూ అటెంప్ట్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు. కొత్తగా ట్రై చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేశారని ఆశిష్‌కు సలహా ఇచ్చాను. ముందు నటుడిగా ఎదగమని సూచించాను. నా ఆలోచనను ఆశిష్ అర్థం చేసుకున్నాడు. ఆశిష్ కోసం ఈ కథను అనుకోలేదు. నాగ, అరుణ్ కథ చెప్పాక.. ఆశిష్ అయితే ఎలా ఉంటుందో చూడండని చెప్పాను. ఓ వారం తరువాత వాళ్లే వచ్చి ఆశిష్ బాగుంటాడని అన్నారు. పీసీ శ్రీరామ్, కీరవాణి గారికి స్క్రిప్ట్ చెప్పి ఒప్పించారు. చాలా కొత్తగా ఉందని వారు అంగీకరించారు. బడ్జెట్ ఎంతో చెప్పండి.. ఆ బడ్జెట్లోనే తీస్తామని నాగ, అరుణ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదో ఘోస్ట్ లవ్ స్టోరీ. సినిమాను ముందే కొంత మందికి చూపించాలని అనుకున్నాం. కానీ ట్విస్టులు రివీల్ అవుతాయని ముందుగా చూపించడం లేదు’’ అని అన్నారు.


Vaishnavi.jpg

ఆశిష్ (Ashish) మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో హారర్ కామెడీ చిత్రాలను చూశారు. ఇది డిఫరెంట్ జానర్. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఇలాంటి కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘బేబీ’ లాంటి పెద్ద హిట్ కొట్టినా కూడా మా లాంటి కొత్త వారి పక్కన వైష్ణవి నటించింది. మాకు ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. ఏప్రిల్ 25న మా చిత్రం రాబోతోందని అన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మాట్లాడుతూ.. సెల్లార్‌లో అద్భుతమైన సెట్ వేసి ఈ పాటను షూట్ చేశారు. ఆ రోజు బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంటే నాకు ఎంతో భయం వేసింది. ఇంత మంచి పాటను ఇచ్చిన చంద్రబోస్ గారికి థాంక్స్. ఏప్రిల్ 25న మేం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమాను థియేటర్లో చూడండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు కచ్చితంగా ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుందని తెలిపారు.

దర్శకుడు అరుణ్ భీమవరపు (Arun Bheemavarapu) మాట్లాడుతూ.. ఈ కథను నమ్మిన దిల్ రాజు గారికి థాంక్స్. ఇది నా సొంత కథే. ఘోస్ట్‌ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ సినిమా కథను రాయడం ప్రారంభించాను. నేను మూడు నవలలు రాశాను. ఈ కథను కూడా నావల్‌గా రాశాను. కానీ సినిమాగా తీశాను. ఇంత వరకు చేయని, రాయని పాత్రను ఆశిష్ పోషించాడు. ఆ కారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

*Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ

***********************

Updated Date - Mar 30 , 2024 | 08:36 PM