Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ ఇంట్లో పెళ్ళి.. మంగ్లీ పాట పాడితే ఎట్టుండాల!

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:16 PM

‘జితేందర్ రెడ్డి’ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘అ ఆ ఇ ఈ ఉ ఊ’ సాంగ్ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో ఉండగా.. తాజాగా విడుదలైన ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్‌లో గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఈ పాటకి గోపీ సుందర్ స్వరాలు సమకూర్చగా.. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. ఎప్పటిలానే మంగ్లీ తన మ్యాజిక్ వాయిస్‌తో ఈ పాటకు ఓ రేంజ్‌లో ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ ఇంట్లో పెళ్ళి.. మంగ్లీ పాట పాడితే ఎట్టుండాల!
Jithender Reddy Movie Still

‘పేక మేడలు’ సినిమాతో నిర్మాతగా.. ‘బాహుబలి, ఎవరికి చెప్పొద్దు’ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె (Rakesh Varre) లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాలా జంపాలా’, ‘మజ్ను’ సినిమాలతో సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరొందిన విరించి వర్మ (Virinchi Varma) దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి (Muduganti Ravinder Reddy) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా (Political Drama) చిత్రమిది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ వంటివారు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా మంగ్లీ పాడిన ‘లచ్చిమక్క’ లిరికల్ సాంగ్‌ (Lachimakka Lyrical Video Song)ను మేకర్స్ విడుదల చేశారు.

*Chiranjeevi: 100వసారి ర‌క్త‌దానం.. మ‌హ‌ర్షి రాఘ‌వను సత్కరించిన చిరు


ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. రీసెంట్‌గా మేకర్స్ విడుదల చేసిన ‘అ ఆ ఇ ఈ ఉ ఊ’ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. ‘అ ఆ ఇ ఈ ఉ ఊ’ సాంగ్ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో ఉండగా.. తాజాగా విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్‌లో గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఈ పాటకి గోపీ సుందర్ (Gopi Sundar) స్వరాలు సమకూర్చగా.. రాంబాబు గోసాల (Rambabu Gosala) సాహిత్యం అందించారు. ఎప్పటిలానే మంగ్లీ (Singer Mangli) తన మ్యాజిక్ వాయిస్‌తో ఈ పాటకు ఓ రేంజ్‌లో ఆలపించారు. ‘జితేందర్ రెడ్డి’ ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే పాట ఇది. ‘1980’లో లొకేషన్స్ అన్ని కూడా చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అలాగే ఈ పాట చూస్తుంటే కథలో చాలా ట్విస్టులు ఉన్నట్టు అర్థమవుతోంది.


Marriage-Song.jpg

పాట విడుదల సందర్భంగా నిర్మాత ముదిగంటి రవీందర్ రెడ్డి (Producer Muduganti Ravinder Reddy) మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరుకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్నింటికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. కొత్త నిర్మాతలమైనప్పటికీ ప్రేక్షకులు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. కంటెంట్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆ సినిమాని ఆదరిస్తారు అని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మే 3న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

vaishali-raj.jpg

Updated Date - Apr 18 , 2024 | 01:16 PM