Sangeet: ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌తో మొదలైన ‘సంగీత్’..

ABN , Publish Date - May 14 , 2024 | 04:21 PM

లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సంగీత్’. ఈ చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా, శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌ కొట్టారు.

Sangeet: ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌తో మొదలైన ‘సంగీత్’..
Sangeet Movie Launch

లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సంగీత్’ (Sangeet). ఈ చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల (Niharika Konidela) చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా, శౌర్య (Shourya) కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ (SS Karthikeya) క్లాప్‌ కొట్టారు. ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్‌రాజ్’తో ఎంతగానో గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు సాద్ ఖాన్ (Saad Khan) ‘సంగీత్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిభగల టీంతో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నారు. ప్రేమ, కుటుంబ బంధాలు, జీవితంలోని మధురానుభూతుల మేళవింపుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సమర్థ్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. సమర్థ్ పాత్రలో నిఖిల్ విజయేంద్ర సింహ నటించనున్న ఈ చిత్రంలో.. తన సోదరుడి వివాహ వేడుకలో సమర్థ్ జీవితం ఎలాంటి ఊహించని మలుపు తిరిగింది అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న నిఖిల్ విజయేంద్ర సింహాను ‘సంగీత్’ చిత్రం ద్వారా లహరి ఫిల్మ్స్ పరిచయం చేస్తోంది. నిఖిల్‌కి జోడిగా తేజు అశ్విని కనిపించనుంది.

ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా నిఖిల్ విజయేంద్ర సింహా (Nikhil Vijayendra Simha) మాట్లాడుతూ.. నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ‘సంగీత్’ నా హృదయానికి దగ్గరగా ఉన్న కథ. కథానాయకుడిగా సమర్థ్ పాత్రలోని భావోద్వేగాలను చూపించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో భాగమైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలకు, చిత్ర బృందానికి నా కృతజ్ఞతలని తెలపగా.. ‘‘ఈ చిత్రం బాంధవ్యాల గురించి, జీవితంలోని మధురానుభూతుల గురించి ఉంటుంది. ఎంతో ప్రతిభగల చిత్ర బృందంతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. స్వర పాత్రలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని హీరోయిన్ తేజు అశ్విని (Teju Ashwini) అన్నారు.


Sangeet-3.jpg

చిత్ర దర్శకుడు సాద్ ఖాన్ మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో ఓ కుటుంబంలో జరిగే సంఘటనలను వినోదభరితంగా చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా తమదైన ముద్ర వేసిన నవీన్, చంద్రు, శ్రవంతి గార్లతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఇచ్చిన స్వేచ్ఛతో, చిత్ర బృందం సహకారంతో ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి ఇస్తామని నమ్మకంగా ఉన్నామని అన్నారు. కాగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాజ్ ఖాన్ నేతృత్వంలోని రైన్‌షైన్ కంపెనీ ఫస్ట్‌యాక్షన్‌తో కలిసి నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రవంతి నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (Sangeet Movie Launched)

Sangeet-2.jpg

Updated Date - May 14 , 2024 | 04:22 PM