Priyadarshi: మోహనకృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు ప్రియదర్శితో...

ABN , Publish Date - Mar 25 , 2024 | 12:41 PM

దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 'జెంటిల్ మన్', 'సమ్మోహనం' తరువాత ప్రియదర్శి తో సినిమా చెయ్యడానికి పూనుకున్నారు. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. తెలుగమ్మాయి రూప రూప కొడువాయూర్ కథానాయిక.

Priyadarshi: మోహనకృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు ప్రియదర్శితో...
Sivalenka Krishna Prasad, Indranganti Mohan Krishna, Roopa Koduvayur and Priyadarshi at the launch of their new film

ఇంద్రగంటి మోహన్ కృష్ణ తనకంటూ దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 'గ్రహణం' అనే ఒక సినిమా తీసినప్పుడే అతని అభిరుచి, అతనికి సినిమా పట్ల వున్న మక్కువ, అతని సాహిత్య నేపధ్యం ఇవ్వన్నీ అర్థం అవుతాయి. నానిని నటుడిగా పరిచయం చేస్తూ ఇంద్రగంటి 2006లో తీసిన 'అష్ట చెమ్మ' మొదటి ఘన విజయం దర్శకుడిగా. ఆ తరువాత తీసిన 'గోల్కొండ హై స్కూల్', 'అంతకు మించి ఆ తరువాత' సినిమాలో విజయం సాధించటమే కాకుండా, ఇంద్రగంటిని ఒక ప్రత్యేక దర్శకుడిగా పేరు తీసుకొచ్చాయి.

ఇంద్రగంటి ఏ సినిమా చేసినా అది చాలా క్లీన్ గా వుంది సకుటుంబంగా చూసే విధంగా ఉంటుంది. 'అమీ తుమీ', 'సమ్మోహనం' కూడా విజయం సాధించి ఇంద్రగంటి మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఇంద్రగంటి చివరి రెండు సినిమాలు 'వి' (2020), 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (2022) బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా విజయం సాధించలేదు. ఇంద్రగంటి పెన్నుకు కొంచెం పదును తప్పింది అనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి.

priyadarshiroopa.jpg

అయితే అవన్నీ తప్పు అని చెప్పడానికే ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ కి శ్రీకారం చూట్టారు ఇంద్రగంటి. కథానాయకుడు ప్రియదర్శి, అతని పక్కన రూప కొడువాయూర్ కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో 'జెంటిల్ మన్' (2016), ఇంద్రగంటి, సుధీర్ బాబుతో 'సమ్మోహనం' (2018) లాంటి విజయవంతమైన సినిమాలు చేసిన సంస్థ శ్రీదేవి మూవీ ఈ ఇంద్రగంటి, ప్రియదర్శి కాంబినేషన్ సినిమాని కూడా నిర్మిస్తోంది.

ఈ చిత్రం ఈరోజు అంటే సోమవారం (మార్చి 25) ఉదయం నిర్మాత సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

sivalenkakrishnaprasad.jpg

ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభాశాలి మోహనకృష్ణ ఇంద్రగంటి తో ఇంతకు ముందు 'జెంటిల్ మన్', 'సమ్మోహనం' చిత్రాలు తీసాం. ఇప్పుడు మళ్ళీ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. 'బలగం' తో కథానాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి ఇది యాప్ట్ సబ్జెక్. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇదో క్యూట్ ఫిలిం, స్వీట్ ఎంటర్టైనర్ అని చెప్పారు.

ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత ఈ సినిమాలో కుటుంబ సభ్యులు అందరూ వీక్షించే విధంగా చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెపుతున్నారు. ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాల గారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలయింది, అని తెలిపారు.

Updated Date - Mar 25 , 2024 | 12:41 PM