Gam Gam Ganesha: మల్లారెడ్డి కాలేజీలో ధూమ్ ధామ్‌గా ‘పిచ్చిగా నచ్చాశావే’ పాట విడుదల

ABN , Publish Date - May 04 , 2024 | 10:55 PM

‘బేబి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న సినిమా ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్‌ని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు.

Gam Gam Ganesha: మల్లారెడ్డి కాలేజీలో ధూమ్ ధామ్‌గా ‘పిచ్చిగా నచ్చాశావే’ పాట విడుదల

‘బేబి’ (Baby) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటిస్తోన్న సినిమా ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ (Picchiga Nacchesave Lyrical Song) పాటను మల్లారెడ్డి కాలేజ్ (Mallareddy College) విద్యార్థుల సందడి మధ్య రిలీజ్ చేశారు.

ఈ పాటను హీరోహీరోయిన్లు ఆనంద్ దేవరకొండ,‌ నయన్ సారిక మధ్య రొమాంటిక్ లవ్ సాంగ్‌గా రూపొందించారు. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా సురేష్ బనిశెట్టి సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి పాడారు.

Anand.jpg

పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా, కళ్లల్లో జల్లేశావే రంగులన్నీ భలేగా,

పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా, జంటగా వచ్చాశానే అందుకనేగా,

మనసే పట్టి పట్టి మాయలోకి నెట్టేశావే, ప్రేమ గట్టి గట్టి కంకణంలా కట్టేశావే,

నీ మువ్వల పట్టి గుండెకు కట్టి మోగించేశావే, ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేశావే..అంటూ మంచి బీట్‌తో సాగుతుందీ పాట. పాట పిక్చరైజేషన్, పాటలో ఆనంద్ డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. (Gam Gam Ganesha Second Lyrical Song Released)

*Thalaimai Seyalagam: శ్రియారెడ్డి ప్రధాన పాత్రలో ‘తలమై సెయల్గమ్’.. టీజర్, స్ట్రీమింగ్ డేట్ వచ్చేశాయ్


Anand-Deverakonda.jpg

పాట విడుదల కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను కొన్నేళ్ల కిందట స్పోర్ట్స్ ఆడేందుకు ఈ కాలేజ్‌కు వచ్చాను. ఇంత పెద్ద కాలేజ్ చూసి ఆశ్చర్యపోయాను. మన సొసైటీకి రేపటి ఫ్యూచర్ మీరే (విద్యార్థులను ఉద్దేశిస్తూ). మీలో చాలా మంది బాగా చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారని విన్నాను. మీ అందరి సమక్షంలో మా ‘గం..గం..గణేశా’ సినిమా పిచ్చిగా నచ్చాశావే సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ‘బేబి’ సినిమాలో ఎంత ఏడ్చారో ఈ సినిమాలో నన్ను చూసి అంత నవ్వుతారు. ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగా, విజయ్ దేవరకొండ తమ్ముడిగానే తెలుసు. ‘బేబి’ సినిమాతో ఆనంద్ దేవరకొండగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా స్టోరీ సెలక్షన్స్ బాగుంటాయని చెబుతుంటారు. ఈ సినిమా స్క్రిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ట్విస్ట్స్, టర్న్స్ ఉంటాయి. క్రైమ్, కామెడీ, యాక్షన్‌తో అంతా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. మే 31న థియేటర్స్‌కు వెళ్లండి. చేతన్ భరద్వాజ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ‘ఆర్‌ఎక్స్ 100, ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాలకు చేతన్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలోనూ బృందావనివే వంటి ఛాట్ బస్టర్ అందించాడు. అనురాగ్ కులకర్ణి నాకు అమేజింగ్ సాంగ్స్ పాడాడు. ‘బేబి’లో ప్రేమిస్తున్నా సాంగ్ ను సురేష్ బనిశెట్టి అన్న రాశారు. ఈ పిచ్చిగా నచ్చాశావే సాంగ్ కూడా బ్యూటిఫుల్‌గా రాశారు. ఉదయ్ శెట్టి నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌తో ఓపికగా ట్రావెల్ చేస్తూ ఎంతో కష్టపడి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తను ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అవుతాడని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు చిత్రబృంద సభ్యులు మాట్లాడారు.

Read Latest Cinema News

Updated Date - May 04 , 2024 | 10:55 PM