scorecardresearch

Celebrity Journey: ఈ అగ్రతారలు ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా!

ABN , Publish Date - Oct 26 , 2024 | 06:22 PM

ఇప్పుడు స్టార్స్‌గా ఎదిగి ఇండస్ట్రీని ఏలుతున్న తారలు.. ఒకప్పుడు మనలాగానే సాధారణ జీవితం గడిపిన వారే. ఇప్పుడు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరో హీరోయిన్లు‌గా చలామణి అవుతున్నవారు గతంలో అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. వీరి సినిమాలు, నటన, అందం మాత్రమే కాదు వారి పాస్ట్ లైఫ్ కూడా ఎంతో ఆదర్శనీయం.

Celebrity Journey: ఈ అగ్రతారలు ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా!

sethupathireddy.jpgతన అద్భుతమైన నటనతో కేవలం సౌతిండియాలోనే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ టాలెంటెడ్ డైరెక్టర్‌కైనా ఫస్ట్ ఛాయిస్ విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి.. డిగ్రీ పాస్ కాగానే కుటుంబ ఆర్థిక భారాన్ని తనపై వేసుకున్నారు. మొదట ఒక నిర్మాణ రంగ సంస్థలో అసిస్టెంట్‌గా చేరిన విజయ్ తర్వాత బట్టల దుకాణంలో సేల్స్ మాన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో క్యాషియర్, ఫోన్ బూత్ ఆపరేటర్ గాను పనిచేశాడు. డబుల్ శాలరీకి ఆశపడి రెండేళ్లు దుబాయిలో పని చేశానని విజయే స్వయంగా చెప్పారు. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేసిన లాభాలు రాకపోవడంతో మార్కెటింగ్ కంపెనీలో చేరారు మన సేతుపతి.


kiara.jpgమన 'గేమ్ ఛేంజర్' బ్యూటీ కియారా అద్వానీ సినిమాల్లోకి రాకముందు ప్రీస్కూల్లో నర్సరీ టీచర్‌గా పనిచేశారట. అక్కడ పిల్లలకు అక్షరాలు, అంకెలు, రైమ్స్ నేర్పించడం దగ్గర నుంచి డైపర్స్ మార్చడం దాకా.. అన్నీ తానే దగ్గరుండి చేసేదట. ఉదయం ఏడుగంటల నుండి సాయంత్రం వరకు పిల్లలతో గడపటంతో టైమే తెలిసేది కాదట ఈ బ్యూటీకి. అయితే గుడ్ న్యూస్, కబీర్ సింగ్ సినిమాల్లో ప్రెగ్నెంట్‌గా నటించిన తనకి తన టీచింగ్ డేస్ ఎంతో ఉపయోగపడ్డాయట.


jaki.jpgఇక బాలీవుడ్ హాట్ సెన్సేషన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఒక జర్నలిస్ట్ అని చాలా మందికి తెలీదు. మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా పొందిన ఈ అమ్మడు.. వార్తల కోసం ఉదయం నుండి బయట తిరిగేదట. ప్రతి రోజు జాబ్ లైఫ్ ఛాలెంజింగ్ ఉండేదట. జర్నలిస్ట్ వృత్తి నుండే టూ సైడ్స్ నుండి ఆలోచించే విధానాన్ని అలవర్చుకున్నాని తను తెలిపింది.

Updated Date - Oct 26 , 2024 | 07:33 PM