Family Star: ‘ఫ్యామిలీ స్టార్’.. ‘మధురము కదా..’ అప్డేట్

ABN , Publish Date - Mar 24 , 2024 | 08:05 PM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ‘మధురము కదా..’ అంటూ సాగే ఈ పాట రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. హోలీ స్పెషల్‌గా ఈ లిరికల్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాట రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’.. ‘మధురము కదా..’ అప్డేట్
Family Star Movie Still

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ‘మధురము కదా..’ అంటూ సాగే ఈ పాట రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. హోలీ స్పెషల్‌గా ఈ లిరికల్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాట రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆర్కిటెక్ట్‌గా విజయ్ దేవరకొండ తను వర్క్ చేస్తున్న బిల్డింగ్ దగ్గర మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)తో కలిసి కూర్చుని మాట్లాడుతున్నట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

‘మధురము కదా..’ లిరికల్ సాంగ్ విజయ్, మృణాల్ లవ్ సాంగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్ పాడారు. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేస్తున్న ఒక్కో పాటతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా మారుతోంది. ఫస్ట్ సింగిల్ ‘నందనందనా’.. సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ చాట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడీ థర్డ్ సాంగ్‌పై మ్యూజిక్ లవర్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ సాంగ్ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. (Family Star Third Single Release Update)


Mrunal-Thakur.jpg

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) రూపొందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సాంగ్ విడుదలను పురస్కరించుకుని.. విజయ్ దేవరకొండ కూడా ట్విట్టర్ వేదికగా.. అప్డేట్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: హీరో శ్రీకాంత్ ఇంట్లో చిరు.. మ్యాటర్ ఇదే..

******************************

*Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..

**************************

*Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

*******************************

Updated Date - Mar 24 , 2024 | 08:05 PM