మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kubera: ధనుష్, నాగ్‌లతో శేఖర్ కమ్ముల చేస్తున్న చిత్ర టైటిల్ ఇదే..

ABN, Publish Date - Mar 08 , 2024 | 04:30 PM

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన చిత్రాలను రూపొందించడంలో మంచి పేరు తెచ్చుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జునతో ఓ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కుబేర’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. మేకర్స్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నారు.

Kubera Movie

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన చిత్రాలను రూపొందించడంలో మంచి పేరు తెచ్చుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula). ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (King Nagarjuna)తో ఓ మల్టీ స్టారర్ చిత్రం (#DNS) చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్ యూనిట్) (Sree Venkateswara Cinemas LLP) బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కుబేర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. (#Kubera)


అంతకు ముందు ఫస్ట్ లుక్ మహాశివరాత్రికి అని తెలుపుతూ విడుదల చేసిన త్రిశూల పోస్టర్ అందరినీ ఆకర్షించగా.. ఇప్పుడు టైటిల్ లుక్ రిలీజ్ మాత్రం కాస్త ఆలస్యం అవుతుందని మేకర్స్ ప్రకటించారు. టైటిల్ పరంగా చూస్తే.. శేఖర్ కమ్ముల ఈ ఇద్దరు స్టార్స్‌తో ఓ వినూత్నమైన చిత్రం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, శేఖర్ కమ్ముల ఎంత సెన్సిబుల్ డైరెక్టరో.. ఆయన సినిమా టైటిల్స్ కూడా అంతే సెన్సిబుల్‌గా ఉంటాయి. కానీ ‘కుబేర’ టైటిల్ వింటుంటే మాత్రం ఇదేదో ఊర మాస్ చిత్రం అనేలా అనిపిస్తుంది. మరి శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని ఏ తరహాలో రూపొందిస్తున్నారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. (Kubera Movie First Look Out). రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

*Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..

*******************************

*Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...

****************************

Updated Date - Mar 08 , 2024 | 05:26 PM