Dhoom Dham: ‘ధూం ధాం’ మూవీ ఫస్ట్ లుక్ వదిలారు..

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:30 PM

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి దర్శకుడు సాయి కిశోర్ మచ్చ. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Dhoom Dham: ‘ధూం ధాం’ మూవీ ఫస్ట్ లుక్ వదిలారు..
Dhoom Dham Movie First Look

చేతన్ కృష్ణ (Chetan Krishna), హెబ్బా పటేల్ (Hebah Patel) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’ (Dhoom Dham). సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి దర్శకుడు సాయి కిశోర్ మచ్చ (Sai Kishore Macha). గోపీ మోహన్ (Gopi Mohan) స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమాను.. ఈ సమ్మర్‌కు రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ టీమ్ చిత్ర ఆన్ లొకేషన్‌లో రిలీజ్ చేశారు.


Dhoom-Dham.jpg

ఈ ‘ధూం ధాం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. పెళ్లి బారాత్‌లో హీరోహీరోయిన్లు హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్‌ను ఫస్ట్ లుక్ పోస్టర్‌గా మేకర్స్ విడుదల చేశారు. కలర్ ఫుల్‌గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. (Dhoom Dham First Look Out)


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

****************************

*Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్

**************************

*Aa Okkati Adakku: థమన్ వదిలిన ‘ఓహ్ మేడమ్’ సాంగ్

***********************

*RC16: అఫీషియల్.. రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్

**************************

Updated Date - Mar 06 , 2024 | 01:50 PM