Dear: అన్నపూర్ణకు ఆంధ్ర .. ఏషియన్‌కు తెలంగాణ

ABN , Publish Date - Mar 29 , 2024 | 07:54 PM

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్‌పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒక రోజు గ్యాప్‌తో అనగా.. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల రైట్స్ ప్రముఖ బ్యానర్స్ సొంతం చేసుకున్నాయి.

Dear: అన్నపూర్ణకు ఆంధ్ర .. ఏషియన్‌కు తెలంగాణ
Dear Movie Still

జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్‌గా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’ (Dear). ఆనంద్ రవిచంద్రన్ (Anand Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్‌పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒక రోజు గ్యాప్‌తో విడుదలకానుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ ఎవరు సొంతం చేసుకున్నారంటే..


Dear.jpg

‘డియర్’ మూవీ ఆంధ్ర థియేట్రికల్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) కొనుగోలు చేయగా.. ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) తెలంగాణ థియేట్రికల్ హక్కులను (Theatrical Rights) సొంతం చేసుకుంది. హ్యూజ్ థియేట్రికల్ చైన్ బిజినెస్ ఉన్న ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ సంస్థల బ్యాకింగ్‌తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందించారు. ఇటీవల ఆయన రూపొందించిన ‘మాస్టారు మాస్టారు’ పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ‘డియర్’ (Dear Movie)కు సంబంధించి తమిళంలో విడుదలైన రెండు పాటలు చార్ట్‌లలో అదరగొడుతున్నాయి. త్వరలో తెలుగులో కూడా ఈ పాటలను విడుదల చేయనున్నారు. కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Dear-Movie.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

************************

*VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

***********************

*Manchu Manoj: రామ్ చరణ్‌కి అర్థరాత్రి కాల్ చేశా.. క్షణంలో రూ. 5 లక్షలు పంపాడు

*****************************

*Siddharth and Aditi Rao Hydari: అదితి రావు క్లారిటీ ఇచ్చేసింది

********************

Updated Date - Mar 29 , 2024 | 07:55 PM