మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nani33: ‘దసరా’ ట్రయో ఈజ్ బ్యాక్

ABN, Publish Date - Mar 31 , 2024 | 01:43 PM

2023 బిగ్గెస్ట్ హిట్‌లలో పీరియడ్ లవ్, మాస్ యాక్షన్ డ్రామా ‘దసరా’ ఒకటి. నేచురల్ స్టార్ నానితో సహా ఈ సినిమాలో భాగమైన దాదాపు ప్రతి ఒక్కరికీ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. ఇప్పుడీ ‘దసరా’ త్రయం మరోసారి చేతులు కలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న కొత్త చిత్రం #Nani33 కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టారు.

Nani33 Announcement Poster

2023 బిగ్గెస్ట్ హిట్‌లలో పీరియడ్ లవ్, మాస్ యాక్షన్ డ్రామా ‘దసరా’ (Dasara) ఒకటి. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani)తో సహా ఈ సినిమాలో భాగమైన దాదాపు ప్రతి ఒక్కరికీ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. ఇప్పుడీ ‘దసరా’ త్రయం మరోసారి చేతులు కలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించనున్న కొత్త చిత్రం #Nani33 కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో నాని మరోసారి జతకట్టారు. శ్రీకాంత్ ఓదెల ‘దసరా’తోనే దర్శకుడిగా అరంగేట్రం చేశారు. దసరా కమర్షియల్ హిట్‌ సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటి ప్రశంసలు అందుకున్నారు. మునుపెన్నడూ లేని మాస్ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్ చేసి.. డెబ్యూ డైరెక్టర్‌గా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇప్పుడు మరోసారి నానిని డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. తాజాగా నానితో శ్రీకాంత్ ఓదెల చేయబోతున్న సినిమా ప్రకటనను మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ వదిలారు.

ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఎరుపు రంగులో పెయింట్ చేయబడింది, ఇది వైలెన్స్ సూచిస్తుంది. నాని గడ్డం, మెలితిప్పిన మీసాలతో మ్యాసీవ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. స్టైలిష్ షేడ్స్‌ ధరించి, గ్రేస్ ఫుల్‌గా సిగార్‌ను కాలుస్తూ కనిపించారు. ‘You don’t need an identity to be a leader’ అని పోస్టర్ పై రాసి ఉంది. వాస్తవానికి, నాని ముఖం అతని పాత్రను సూచించే నేపథ్యంలో జనసమూహంతో డిజైన్ చేయబడింది. నానిని పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి శ్రీకాంత్ మరో విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా ఈ పోస్టర్‌తో తెలుస్తోంది. (Nani33 Movie Announcement)


ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ కొత్త సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అన్ని రకాల జోనర్స్, సబ్జెక్ట్‌లతో అలరిస్తున్న నాని.. శ్రీకాంత్ ఓదెల (Director Srikanth Odela)తో కలిసి మళ్లీ పనిచేయడానికి ఉత్సాహంగా వున్నట్లుగా తెలిపారు. ఈ క్రేజీ, బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో సినిమా కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాల పరంగా బిగ్గర్‌గా వుండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటున్నా..

************************

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

Updated Date - Mar 31 , 2024 | 01:43 PM