Chitti Potti: ‘చిట్టి పొట్టి’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - May 11 , 2024 | 07:07 PM

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘చిట్టి పొట్టి’. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నా చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు అన్నీ ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

Chitti Potti: ‘చిట్టి పొట్టి’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
Chitti Potti Movie Still

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దాసరి (Bhaskar Yadav Dasari) దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నా చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు అన్నీ ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Chitti Potti Movie First Look and Motion Poster)


*AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న మద్దతు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్వీట్స్


Chitti-Potti.jpg

ఈ సందర్భంగా దర్శకనిర్మాత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మగా... ఒక అడబిడ్డకి పుట్టింటిపైన ఉన్న ప్రేమ, మమకారంను తెలిపే చిత్రమిది. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. చిత్ర టైటిల్, మరియు మోషన్ పోస్టర్‌కు చక్కటి ఆదరణ లభిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతం అందిస్తున్నారు. (Chitti Potti Telugu Movie)

Read Latest Cinema News

Updated Date - May 11 , 2024 | 07:07 PM