Vishwak Sen: అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌.. ఈ టీమ్‌ను చూస్తే ముచ్చ‌టేసింది

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:13 PM

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘యేవ‌మ్‌’. ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Vishwak Sen: అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌.. ఈ టీమ్‌ను చూస్తే ముచ్చ‌టేసింది
Yevam Pre Release Event

చాందిని చౌద‌రి (Chandini Chowdary), వ‌శిష్ట సింహా (Vasishta Simha), భరత్‌రాజ్‌ (Bharat Raj), అషు రెడ్డి (Ashu Reddy) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘యేవ‌మ్‌’ (Yevam). ప్రకాష్‌ దంతులూరి (Prakash Dantuluri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌ (Navdeep), పవన్‌ గోపరాజు (Pawan Goparaju) నిర్మాతలు. ఈ నెల 14న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen), ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్ (Sandeep Raj) ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

Also Read- Ap Cm Oath Ceremony: బాబు ప్రమాణ స్వీకారం.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం!

ఈ సంద‌ర్భంగా హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ.. హీరో న‌వ‌దీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ, నిర్మాతగా చేస్తే వయలెన్స్ ఎక్కువ అని అర్థ‌మైంది. ఈ సీ స్పేస్ అనే సంస్థ‌తో నిర్మాత‌గా నవదీప్ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సాధారణంగా అందరూ సినిమాలు చేసిన త‌ర్వాత.. ఆ సినిమాలోని చాలా త‌క్కువ మందితో ట‌చ్‌లో వుంటారు. ఇక నేను న‌టించి రెస్పెక్ట్ చేసే వాళ్ల‌లో చాందిని చౌద‌రి ఒక‌రు. టెన్ష‌న్ ప‌డే క్యాండేట్ చాందిని. ఈ సినిమాతో చాందినికి ఆ భ‌యం పోయింది. ఈ సినిమా ద్వారా ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు, ఫీమేల్ ఎడిట‌ర్‌, ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి ప‌నిచేయడం చాలా ఆనందంగా వుంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌. ఈ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌టేసింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌రికీ మంచి బ్రేక్‌‌కు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. మరో గెస్ట్ సందీప్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా థ్రిల్ల‌ర్‌లు చూసి వుంటాం. ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్‌గా వుంటుంది. నాకు బాగా న‌చ్చింది. ఇంట‌ర్వెల్‌, ప‌తాక స‌న్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా వుంటాయి. చాలా మంచి సినిమా.. అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుందని తెలిపారు. (Yevam Pre Release Event)

Yevam-Movie.jpg

హీరోయిన్ చాందిని చౌద‌రి (Heroine Chandini Chowdary) మాట్లాడుతూ.. ఈ సంవ‌త్స‌రం నా సినిమాలు వ‌రుస‌గా వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. అన్ని సినిమాలు అనుకోకుండా ఒకేసారి విడుద‌లవుతున్నాయి. నా ఇన్నేళ్ల కృషి ఇప్పుడు ఫ‌లితం చూపిస్తుంది. నా లైఫ్‌లో మెమెర‌బుల్ సినిమాను ఇచ్చిన సందీప్ రాజ్, నా కో-యాక్ట‌ర్ విశ్వ‌క్‌సేన్‌కు థ్యాంక్స్‌. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఎద‌రుచూస్తున్న త‌రుణంలో ఈ సినిమా వ‌చ్చింది. పోలీస్ పాత్ర అన‌గానే యాక్ష‌న్ ఓరియెంటెడ్‌గా నా పాత్ర వుంటుంద‌ని అనుకున్నాను. అయితే యాక్ష‌న్‌తో పాటు అన్ని షేడ్స్ నా పాత్ర‌లో వున్నాయి. త‌ప్ప‌కుండా ఈ సినిమా అందరినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నానని అన్నారు.

*ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల పెళ్లి ఫొటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


Yevam-2.jpg

చిత్ర నిర్మాతలో ఒకరైన న‌వ‌దీప్ (Navdeep) మాట్లాడుతూ.. కంటెంట్ బేస్డ్ సినిమాల‌కు విశ్వ‌క్‌సేన్ ఎంతగానో స‌పోర్ట్ ఇస్తారు. ఈ విష‌యంలో విశ్వ‌క్ సూప‌ర్‌స్టార్‌. మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ఇది. సినిమా మీద పిచ్చి త‌ప‌న వున్న హీరోయిన్ చాందిని చౌద‌రి, ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తుంది. రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా ఎప్పుడూ డిఫ‌రెంట్ సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల కోసం త‌ప‌న ప‌డుతుంది. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రం చాందిని కెరీర్‌లో ది బెస్ట్‌గా వుండాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి (Prakash Dantuluri) మాట్లాడుతూ.. నా క‌థ‌ను, నా పాత్ర‌ను న‌మ్మి ఈ సినిమా చేసింది చాందిని. నాకు ఈ సినిమా విష‌యంలో నవ‌దీప్ ఫుల్ స‌పోర్ట్ వుంది. ప్ర‌తి విష‌యంలో ఆయ‌న నాతో వున్నాడు. ఈ సినిమా చూసి సందీప్‌రాజ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాలో ధైర్యాన్ని నింపింది. కీర్త‌న్ నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్ల‌స్ అవుతుంది. ఈ సినిమాకు పనిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు నేను ఊహించిన దానికంటే బెట‌ర్ అవుట్‌పుట్ ఇచ్చారు. అంద‌రి స‌హ‌కారంతో ఓ మంచి సినిమా తీశాం. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్. జూన్ 14న వస్తోన్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 11 , 2024 | 04:13 PM