Yevam: జూన్‌ 14న థియేట‌ర్ల‌లోకి.. చాందిని ‘యేవ‌మ్‌’

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:46 PM

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. తాజాగా మేకర్స్‌ ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు.

Yevam:  జూన్‌ 14న థియేట‌ర్ల‌లోకి.. చాందిని ‘యేవ‌మ్‌’
yevam

రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై పూర్తి విశ్వాసంతో ఉన్నామంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి (Prakash Dantuluri). ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యేవమ్‌ (Yevam). చాందిని చౌద‌రి (Chandini Chowdary), వ‌శిష్ట సింహా (Vasishta N Simha), భరత్‌రాజ్ (Jai Bharat Raj), ఆషు రెడ్డి (Ashu Reddy) ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్ (Navdeep), పవన్‌ గోపరాజు (Pavan Kishore) నిర్మాతలు.

y.jpg


ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా మేకర్స్‌ ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. జూన్‌ 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల‌లోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు ప్రకాష్‌ దంతులూరి (Prakash Dantuluri) మాట్లాడుతూ మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుందని, చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో మినింగ్‌ఫుల్‌గా, కొత్త‌గా ఉంటుంద‌న్నారు. ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్‌తో.. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా ఉంటుందనన్నారు.

GO-0MbnWwAEGZjG.jpeg

Updated Date - Jun 05 , 2024 | 12:46 PM