Parakramam: ప్రముఖులు ఆవిష్కరించిన బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ టీజర్

ABN , Publish Date - May 25 , 2024 | 10:11 PM

బిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Parakramam: ప్రముఖులు ఆవిష్కరించిన బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ టీజర్
Parakramam Movie Teaser Launch Event

బిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’ (Parakramam Movie). శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), దర్శకులు బుచ్చిబాబు (Buchi Babu Sana), జ్ఞానసాగర్ ద్వారక (Gnanasagar Dwaraka), నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) వంటి ప్రముఖులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) మాట్లాడుతూ.. ‘‘నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చాను. చాలా మంది డైరెక్టర్స్‌కు ఆడిషన్స్ ఇచ్చాను. వారికి నా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మాట్లాడినట్లు డైలాగ్స్ చెబుతున్నావ్ అనేవారు. నాకు ఇక్కడ సూట్ కాదని అర్థమైంది. నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే కావాలి అనుకుని దర్శకుడిగా మారాను. చిన్నప్పుడు టీవీలో చిరంజీవిగారిని చూశాకే నాకు సినిమా గురించి తెలిసింది. ఆ తర్వాత ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పీసీ శ్రీరామ్, శ్రీకర్ ప్రసాద్ ఇలాంటి వాళ్లంతా నన్ను ఇన్స్పైర్ చేశారు. వీళ్లందరినీ స్ఫూర్తిగా తీసుకుని నాలోని సహజమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్స్‌ను పట్టుకోవాలంటే అసాధారణ ప్రతిభావంతుడనై ఉండాలి. ఈ క్రమంలో ఒక 20 ఏళ్ల పాటు రెగ్యులర్ లైఫ్‌కు దూరంగా ఉండిపోయా. నేను దర్శకుడిగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా చేశా. అవి మూడూ డిజాస్టర్స్ అయ్యాయి. నేనొక ఫెయిల్యూర్ డైరెక్టర్‌నని తెలుసుకున్నా. అప్పుడు నేనే నటించాలని డిసైడ్ అయ్యి నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను. కళ నాది వెల మీది కాన్సెప్ట్‌‌లో యూట్యూబ్‌లో ఆ సినిమాలను ఉంచాను. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. వాళ్లకు తోచినంత డబ్బులు సపోర్ట్ చేశారు. నేను మెయిన్ స్ట్రీమ్ సినిమా చేయాలని, సకుటుంబంగా ఆ సినిమాలను చూడాలని నా సినిమాలను ఇష్టపడేవారు కోరుకున్నారు. వారందరి సపోర్ట్ తో ఎంకరేజ్‌మెంట్‌తో ‘పరాక్రమం’ సినిమా చేశాను. (Parakramam Movie Teaser Launched)


Bandi-Saroj-Kumar.jpg

నేను ఇండస్ట్రీలో ఎక్కువగా తిరగను. స్ట్రైట్ ఫార్వార్డ్‌గా మాట్లాడతా కాబట్టి ఎక్కువమందికి నేను నచ్చను. నాకు ఇండస్ట్రీలో నచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎస్కేఎన్, బుచ్చిబాబు గారు, విశ్వక్ సేన్. ఈ ముగ్గురూ ఇవాళ మా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గెస్టులుగా రావడం సంతోషంగా ఉంది. ఎస్‌కేఎన్ స్ట్రైట్ ఫార్వార్డ్, టాలెంటెడ్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాల్లో టేస్ట్ తెలుస్తుంటుంది. బుచ్చిబాబుగారు ప్రూవ్డ్ డైరెక్టర్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనను ఒకసారి కలిసినప్పుడు మీ ‘మాంగళ్యం’ సినిమాకు నేను 5 వేలు పంపించాను అన్నారు. థ్యాంక్యూ సో మచ్. విశ్వక్ కూడా నాలాగే స్ట్రైట్ ఫార్వార్డ్‌గా మాట్లాడతాడు. నటుడిగా నన్ను ఎవరితోనూ పోల్చకుండా నన్ను నన్నుగా చూస్తాడు. ‘పరాక్రమం’ సినిమా కోసం ఒక యజ్ఞం చేశాం. ఇది ఇంపార్టెంట్ టైమ్ నాకు ఇలాంటి టైమ్‌లో నాకు సపోర్ట్ గా వచ్చిన విశ్వక్‌కు థ్యాంక్స్. నా గత చిత్రాలు కొన్ని సెక్షన్స్ ఆడియెన్స్‌కే పరిమితం కానీ ఈ ‘పరాక్రమం’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. అందుకే నా బ్యానర్‌కు బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ అని పేరు పెట్టాను’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్, దర్శకుడు బుచ్చిబాబు, దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్ కేఎన్‌లతో పాటు నటీనటులు ప్రసంగించారు.

Updated Date - May 25 , 2024 | 10:11 PM