మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Teppa Samudram: అర్జున్ అంబటి చిత్ర టీజర్ వదిలిన అల్లరి నరేష్..

ABN, Publish Date - Mar 09 , 2024 | 08:52 PM

బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై.. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా.. ‘కొరమీను’ ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా.. రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పి.ఆర్ మ్యూజిక్ అందించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని అల్లరి నరేష్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Teppa Samudram Teaser Launch

బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై.. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి (Arjun Ambati), చైతన్యరావు (Chaitanay Rao) హీరోలుగా.. ‘కొరమీను’ ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా.. రవి శంకర్ (Ravi Shankar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’ (Teppa Samudram). సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పి.ఆర్ మ్యూజిక్ అందించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని అల్లరి నరేష్ (Allari Naresh) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

టీజర్ విషయానికి వస్తే.. అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవరు? అనే కోణంలో ఆద్యంతం ఒక మిస్టరీగా ఈ సినిమా ఉంటుందనే విషయాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. 2015లో తెలంగాణ హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది. మరికొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ టీజర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘తెప్ప సముద్రం’ టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని పెద్ద హిట్ చేయగలరని కోరుకుంటున్నానని అన్నారు. (Allari Naresh Launches Teppa Samudram Movie Teaser)


అనంతరం చిత్ర నిర్మాత నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. నేను ఎంతగానో అభిమానించే నటుడు అల్లరి నరేష్. ఆయన చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అంటే.. దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ.. మా సినిమా టీజర్ అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏప్రిల్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ.. నరేష్ అన్నను అడగ్గానే మా చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ సినిమా మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వస్తోంది. ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

************************

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

Updated Date - Mar 09 , 2024 | 08:53 PM