Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' భామ అందాలు చూడాల్సిందే

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:02 PM

అనుపమ పరమేశ్వరన్ 'టిల్లు స్క్వేర్' తో మంచి విజయం సాధించినా, ఇంకా పెద్ద సినిమాలు మాత్రం ఆమెకి రావటం లేదు. ఇప్పుడు ఒక తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు చేస్తున్న అనుపమ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ఫోటోలు మాత్రం పోస్టు చేస్తూ ఉంటుంది.

Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' భామ అందాలు చూడాల్సిందే
Anupama Parameswaran

విజయం కోసం తపిస్తున్న నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. చాలా కాలం తరువాత 'టిల్లు స్క్వేర్' అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుపమ. అందులో ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసే పోలీసు ఆఫీసరుగా నటించిన అనుపమ చివర్లో కొంచెం నెగటివ్ షెడ్ కూడా చూపించింది. సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో కథానాయకుడు. (Anupama Parameswaran posted some of her latest pictures)

anupamaeyelashesc.jpg

అలాగే ఈ సినిమాలో ఇంతకు ముందు సినిమాల్లో ఎన్నడూ చూపించని విధంగా తన గ్లామర్ సైడ్ కూడా అనుపమ కొంచెం చూపించింది అని అంటున్నారు. సిద్ధుతో లిప్ లాక్ సన్నివేశాలు, అలాగే కొన్ని సన్నివేశాల్లో గ్లామర్ డోస్ కూడా కొంచెం పెంచింది అని అంటున్నారు. ముందు ముందు తను గ్లామర్ పాత్రల్లో కూడా నటించగలను అని చెప్పడానికి ఇలా చేసింది అని కూడా ఒక టాక్ నడుస్తోంది.

anupamaeyelashesb.jpg

ఈ సినిమా అనుపమకి బ్రేక్ ఇచ్చినా, ఈ సినిమా విజయం, ఫలితం అన్నీ సిద్ధు ఖాతాలోకే ఎక్కువ వెళ్ళిపోయింది. ఎందుకంటే అనుపమ ఇందులో కథానాయకురాలిగా కాకుండా ఒక పాత్రలో కనపడుతుంది, దానికి తోడు చివర్లో కొంచెం నెగటివ్ షేడ్స్ కూడా ఉండటంతో, ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు అని అంటున్నారు. ('Tillu Square' fame Anupama Parameswaran is now doing each one in Telugu, Tamil and Malayalam films)

అనుపమ మంచి నటి, ఎటువంటి పాత్ర అయినా బాగా చేస్తుంది, కానీ ఇంతకవరకు అగ్రనటులతో ఒక్క సినిమా కూడా ఆమెకి లేదు. అప్పుడెప్పుడో 'ప్రేమమ్' సినిమాలో నాగ చైతన్య పక్కన నటించింది. ఆ తరువాత రామ్ పోతినేని పక్కన రెండు సినిమాలు, నాని పక్కన ఒక సినిమా చేసింది. ఒక్క 'ప్రేమమ్' తప్పితే మిగతా సినిమాలు వ్యాపారపరంగా విజయం సాధించలేదు. 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ పక్కన ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయింది, లేకపోతే అనుపమ అగ్ర నటీమణుల్లో ఒకరుగా చలామణీ అయ్యేది.

anupamaeyelashesa.jpg

ఇప్పుడు అనుపమ ఒక తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా చేస్తోంది. తెలుగు సినిమా 'పరదా' దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, అతను ఇంతకు ముందు 'సినిమా బండి' కి దర్శకత్వం చేశాడు, అది నేరుగా ఓటిటి లో విడుదలైంది. తమిళ సినిమా 'బైసన్' లో ధృవ్ విక్రమ్ పక్కన నటిస్తోంది. మలయాళం సినిమా అంటే ఆమె సొంత సినిమా చేస్తున్నట్టే, ఎందుకంటే ఆమె మలయాళం అమ్మాయే కాబట్టి.

anupamaeyelashes.jpg

అనుపమ సినిమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటూ ఉంటుంది. తన అభిమానుల కోసం ఎప్పుడూ కొత్త కొత్త ఫోటోషూట్ లు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే కొన్ని క్లోజప్ ఫోటోలను పెట్టింది అనుపమ.

Updated Date - Jun 03 , 2024 | 12:02 PM