మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

ABN, Publish Date - Mar 29 , 2024 | 06:05 PM

‘టిల్లు స్క్వేర్’ టాక్, రిజల్ట్‌తో నాకు మాటలు కూడా రావడం లేదని అన్నారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.

Anupama Parameswaran and Siddu Jonnalagadda

‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) టాక్, రిజల్ట్‌తో నాకు మాటలు కూడా రావడం లేదని అన్నారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుని.. సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయానందంలో తాజాగా మేకర్స్ మీడియా సమావేశాన్ని నిర్వహించి తమ సంతోషాన్ని తెలియజేశారు. (Tillu Square Thanks Meet)

ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) మాట్లాడుతూ.. ‘‘ఆనందంలో మాటలు కూడా రావడం లేదు. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి చాలా సంతోషంగా ఉందని అన్నారు. (Anupama Parameswaran Happy with Tillu Square Success)


దర్శకుడు మల్లిక్ రామ్ (Mallik Ram) మాట్లాడుతూ.. ‘‘మొదటి షోకే అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతటి విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత నాగ వంశీ, కళ్యాణ్ శంకర్, రవి ఆంథోనీ, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

***********************

*Manchu Manoj: రామ్ చరణ్‌కి అర్థరాత్రి కాల్ చేశా.. క్షణంలో రూ. 5 లక్షలు పంపాడు

*****************************

*Siddharth and Aditi Rao Hydari: అదితి రావు క్లారిటీ ఇచ్చేసింది

********************

Updated Date - Mar 29 , 2024 | 06:05 PM