Duet: బర్త్‌డే స్పెషల్.. మదన్ పాత్రలో ఆనంద్ దేవరకొండ

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:40 PM

ఆనంద్ దేవరకొండ.. చేసిన అతి తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని సైతం సొంతం చేసుకున్నారు. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ.. హీరోగా తన రూటే సెపరేటు అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ చేస్తున్న మరో విభిన్న చిత్రం ‘డ్యూయెట్’. తాజాగా ఆనంద్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ని మేకర్స్ రివీల్ చేశారు.

Duet: బర్త్‌డే స్పెషల్.. మదన్ పాత్రలో ఆనంద్ దేవరకొండ
Anand Deverakonda in Duet

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda).. చేసిన అతి తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’ (Baby)తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని సైతం సొంతం చేసుకున్నారు. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ.. హీరోగా తన రూటే సెపరేటు అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ చేస్తున్న మరో విభిన్న చిత్రం ‘డ్యూయెట్’ (Duet). యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ ‘డ్యూయెట్’ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో కేఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్ వరదరాజ కృష్ణన్ (Mithun Varadaraja Krishnan) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Anand-Deverakonda.jpg

శుక్రవారం (మార్చి15) ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ‘డ్యూయెట్’ సినిమా నుండి.. ఆయన నటిస్తున్న మదన్ (Madan) క్యారెక్టర్ లుక్‌ను రిలీజ్ చేశారు. మనసంతా ప్రేయసిని నింపుకున్న ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ ఈ లుక్‌లో (Anand Deverakonda in Duet) దర్శనమిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా ఉంటుందని, ఆనంద్ కెరీర్‌లో మరో మంచి చిత్రంగా నిలబడుతుందని చెబుతూ.. ఆనంద్‌కు మేకర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. (#HBDAnandDeverakonda)


ఇవి కూడా చదవండి:

====================

*Hanuman OTT: ఏందయ్యా ఇది.. ఈ ఊరించడమేంటి? ఇంట్రెస్ట్ పోతోంది..

****************************

*Ritika Singh: తలైవర్‌కు ఎప్పటికీ రుణపడివుంటా..

*******************************

*AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్

*****************************

Updated Date - Mar 15 , 2024 | 12:40 PM