Kannappa: మే 13న బిగ్ అప్డేట్ అంటోన్న మంచు విష్ణు

ABN , Publish Date - May 11 , 2024 | 07:50 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ‘కన్నప్ప’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్ అడుగు పెట్టారు. దీంతో ‘కన్నప్ప’ ట్రెండ్ దద్దరిల్లింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మంచు విష్ణు మరో అప్డేట్‌తో వచ్చారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మే 13న ఓ బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు.

Kannappa: మే 13న బిగ్ అప్డేట్ అంటోన్న మంచు విష్ణు

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ‘కన్నప్ప’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) అడుగు పెట్టారు. దీంతో ‘కన్నప్ప’ ట్రెండ్ దద్దరిల్లింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మంచు విష్ణు మరో అప్డేట్‌తో వచ్చారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఏముందంటే..

*AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న మద్దతు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్వీట్స్

‘‘కన్నప్ప నుంచి న్యూస్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆతృతగా చూస్తుంటారు. గత ఐదారు అప్డేట్లు ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్‌లో ట్రెండ్ అయింది. నా మిత్రుడు ప్రభాస్ షూట్‌లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. దాదాపు 18 గంటల పాటు సోషల్ మీడియాలో ఆ వార్త ట్రెండ్ అయింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కి, డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం చెబుతున్నాను. కన్నప్ప సినిమాను నేను చేస్తున్నా.. నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని ప్రభాస్‌కు చెప్పాను. ‘కథ బాగా నచ్చింది నాకు ఈ పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఈ కారెక్టర్‌ను నేను చేయొచ్చా?’ అని ప్రభాస్ అడిగారు. ఏ కారెక్టర్‌ అయితే ప్రభాస్‌కు బాగా నచ్చిందో అదే పాత్రను ప్రభాస్ పోషించారు. ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రలను గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. త్వరలోనే అన్ని పాత్రల గురించి ప్రకటిస్తాం. సోమవారం (మే 13) ఓ అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాము’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. (Manchu Vishnu Insta Post)


Vishnu-Manchu.jpg

మోహన్ బాబు (Mohan Babu) భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పనిచేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Latest Cinema News

Updated Date - May 11 , 2024 | 07:50 PM