మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maruthi Nagar Subramanyam: ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’.. మస్త్ రొమాంటిక్ సాంగ్

ABN, Publish Date - Apr 17 , 2024 | 02:03 PM

టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ మరో కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాలోని రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ను మేకర్స్ విడుదల చేశారు.

Ramya and Ankith Koyya in Maruthi Nagar Subramanyam

టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ (Rao Ramesh) హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య (Lakshman Karya) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ (Indraja) నటించారు. అంకిత్ కొయ్య (Ankith Koyya), రమ్య పసుపులేటి (Ramya Pasupuleti) మరో జంటగా, హర్షవర్ధన్ మరో కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ (Madam Sir Madam Anthe)ను మేకర్స్ విడుదల చేశారు.

*Hari Hara Veera Mallu: ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో!


పాట సందర్భానికి వస్తే.. ఈ సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించగా.. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య అల్లు అర్జున్ (Allu Arjun) అభిమాని. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకుంటున్నట్లుగా ఈ పాట సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. (Madam Sir Lyrical Video Song)


‘తొలి తొలి సారి తొలిసారి

గుండె గంతులేస్తున్నదే!

ఏంటీ అల్లరి అంటే వినకుందే!

ఎందుకనో నువ్వు నచ్చేసి

వెంట వెంట పడుతున్నదే!

కన్ను తోడు రమ్మని పిలిచిందే!

నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత

నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత

ఒక్క మాట చెప్పు ఇంటి ముందు వాలిపోతా

ఏదో మాయ చేశావటే

నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా

నక్సలైటు లాగ నేను నీకు లొంగిపోతా

ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే

తనందం ఎంతటి గొప్పది అంటే

తలెత్తి చూడక తప్పదు అంతే

తలొంచి మొక్కిన తప్పేం కాదే

మేడమ్ సారు మేడమ్ అంతే’ అంటూ సాగిన ఈ పాటను గాయకుడు సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడారు. కళ్యాణ్ నాయక్ (Kalyan Nayak) స్వరాలు సమకూర్చగా.. భాస్కరభట్ల (Bhaskarabatla) ఈ పాటకు సాహిత్యం అందించారు.

ఈ పాట విడుదల సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. టైటిల్ పాత్రలో నటిస్తోన్న రావు రమేష్ లుక్‌కు, అలాగే టైటిల్ సాంగ్ ‘నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం’కు చాలా మంచి స్పందన వచ్చింది. భాస్కరభట్ల తొలి పాటతో పాటు ఈ పాటకూ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాలో సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. అతను పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంకిత్ కొయ్య ఇందులో చాలా మంచి నటన కనబరిచారు. రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - Apr 17 , 2024 | 02:03 PM