Prajakavi Kaloji: ‘ప్రజాకవి కాళోజీ’ చిత్రానికి 7 ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డ్స్

ABN , Publish Date - Mar 20 , 2024 | 02:17 PM

జైనీ క్రియేషన్స్ పతాకంపై, ఇప్పటి వరకు ‘అమ్మా! నీకు వందనం’, ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’ వంటి ప్రయోజనాత్మక సినిమాలను రూపొందించిన డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో.. అదే బ్యానర్‌లో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్. ఈ చిత్రాన్ని ప్రదర్శించిన ప్రతీ చోట విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డులు సైతం వరించాయి.

Prajakavi Kaloji: ‘ప్రజాకవి కాళోజీ’ చిత్రానికి 7 ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డ్స్
Prajakavi Kaloji Bipic Creators

జైనీ క్రియేషన్స్ పతాకంపై, ఇప్పటి వరకు ‘అమ్మా! నీకు వందనం’, ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’ వంటి ప్రయోజనాత్మక సినిమాలను రూపొందించిన డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో.. అదే బ్యానర్‌లో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ (Prajakavi Kaloji) బయోపిక్. ఈ చిత్రాన్ని ప్రదర్శించిన ప్రతీ చోట విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డులు సైతం వరించాయి.

ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2024‌లో ఫీచర్ ఫిక్షన్ కేటగిరిలో స్పెషల్ జ్యురీ అవార్డు, కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023‌లో బెస్ట్ డైరెక్టర్, యాక్టర్ అవార్డులు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 16వ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024 (జెఐయఫ్‌యఫ్)‌లో బెస్ట్ ఫీచర్ డాక్యుమెంటరీ అవార్డు, ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్ 2024లో (మార్చి 30న జరగనుంది) బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు, రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ రీజనల్ తెలుగు అవార్డు, కర్ణాటక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024లో బెస్ట్ బయోపిక్ అవార్డ్‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. (Prajakavi Kaloji Biopic)


Biopic.jpg

పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao) జీవిత విశేషాలతో నిర్మించిన బయోపిక్ చిత్రం గురించి చిత్రసీమకు చెందిన అనేక మంది ప్రముఖులు ప్రశంసించారు. ఒక కవి మీద సినిమా తీయడం చాలా సాహసమని కొనియాడారు. ఇందులోని నాలుగు పాటలు కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మొదట్లో ఈ చిత్రం అందరి విమర్శలు ఎదుర్కున్నా.. చివరికి నా కృషి ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ముఖ్య పాత్రలలో నటించిన మూలవిరాట్ (అశోక్ రెడ్డి), పీవీ మనోహర్ రావు, పద్మ, మల్లిఖార్జున్, నరేష్, రజని మొదలైన వారు అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఈ బయోపిక్ విషయంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ilaiyaraaja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. అధికారిక ప్రకటన వచ్చేసింది

************************

*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్

********************************

*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?

***************************

*Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!

*************************

Updated Date - Mar 20 , 2024 | 02:18 PM