Sonali Bendre: రూ. వంద ఇచ్చిన ఆ ప్రశంసతో ఇక్కడిదాకా వచ్చా!  

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:47 PM

క్యాన్సర్‌ను జయించిన సోనాలి బింద్రే (Sonali Bendre) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కొంత విరామం తీసుకుని ప్రస్తుతం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

Sonali Bendre: రూ. వంద ఇచ్చిన ఆ ప్రశంసతో ఇక్కడిదాకా వచ్చా!  

క్యాన్సర్‌ను జయించిన సోనాలి బింద్రే (Sonali Bendre) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కొంత విరామం తీసుకుని ప్రస్తుతం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ (The broken News) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్థమయ్యారు. జీ5 వేదికగా మే3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌ బిగినింగ్‌లో ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చారు. డ్యాన్స్‌ రాదని అందరూ విమర్శించేవారని చెప్పారు.

‘అరవింద్‌ స్వామి, మనీషా కొయిరాల కీలక పాత్రధారులుగా వచ్చిన ‘బొంబాయి’(Bombay)లో నేను ఒక పాటలో కనిపించాను. అప్పటికి ఐదు సినిమాల్లో మాత్రమే నటించిన అనుభవం నాది. ఆ చిత్రం విడుదల తర్వాత నా కెరీర్‌ పూర్తిగా మారింది. అప్పటి వరకు నాకు డ్యాన్స్‌ రాదని అందరూ విమర్శించేవారు. ఆ పాట చూశాక నన్ను కామెంట్‌ చేసినవారి ధోరణి మారింది. నేను శిక్షణ పొందిన డ్యాన్సర్‌ని కాదు. అందుకే సినిమాల్లోకి వచ్చాక చాలా మంది కొరియోగ్రాఫర్స్‌తో తిట్లుతిన్నాను. అప్పట్లో డ్యాన్స్‌ రాకపోతే హీరోయిన్‌ కాలేరనే భావన బలంగా ఉండేది.. అందుకే సమయం దొరికినప్పుడల్లా డాన్స్  ప్రాక్టీస్‌  చేసేదాన్ని. బొంబాయిలోని పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌ కావడంతో దానిని నేను ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఈ పాటతో మెప్పించాలి లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా.

sonali.jpg

అదే నమ్మకంతో ఆ చిత్రంలో  'హమ్మా.. హమ్మా పాట చేశారు. మణిరత్నం లాంగ్‌ షాట్‌లకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. బొంబాయిలో ‘హమ్మా హమ్మా’ పాటలో చాలా స్టెప్స్‌ సింగిల్‌ టేక్‌లో ఓకే చేశారు. అది చూసిన కొరియోగ్రాఫర్‌ సుందరం మాస్టర్‌ మూమెంట్స్‌ బాగా చేశానని నాకు రూ.100 బహుమతిగా ఇచ్చారు. అంతగొప్ప వ్యక్తి నన్ను ప్రశంసించినందుకు చాలా సంతోషించా. మరెవ్వరి సర్టిఫికెట్‌ అవసరం లేదనిపించింది. ఇండస్ట్రీలో కొనసాగవచ్చని నమ్మకం, ధైర్యం వచ్చింది. అందుకే ఆ సాంగ్‌ ఎప్పటికీ ప్రత్యేకమే. అది నేను హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో పాట కాకపోయినా నా పాటగా మారింది’’ అని అన్నారు. ఏడేళ్ల విరామం తర్వాత సోనాలి ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’లో నటించారు. ఇందులో తన వయసుకు తగిన పాత్ర చేసినట్లు చెప్పారు సోనాలి.


Read More: Telugu cinema, South Cinema, Cinema news

Updated Date - Apr 25 , 2024 | 04:49 PM