మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramayan: సీతగా సాయిపల్లవి లుక్‌ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Apr 27 , 2024 | 03:04 PM

బాలీవుడ్‌లో భారీ స్థాయిలో ‘రామాయణ్‌’(Ramayan)చిత్రాన్ని తీయాలని ఎంతోకాలంగా ప్లాన్  చేస్తున్న సంగతి తెలిసిందే!  నితీష్‌ తివారీ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా ఇటీవల ముంబైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైనట్లు ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.


బాలీవుడ్‌లో భారీ స్థాయిలో ‘రామాయణ్‌’(Ramayan)చిత్రాన్ని తీయాలని ఎంతోకాలంగా ప్లాన్  చేస్తున్న సంగతి తెలిసిందే!  నితీష్‌ తివారీ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా ఇటీవల ముంబైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైనట్లు ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇందులో రాముడిగా రణబీర్‌ కపూర్‌ (Ranbir kapoor), సీతగా (Sai pallavi) సాయిపల్లవి నటిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. తాజాగా సీతారాముల గెటప్పుల్లో ఉన్న వారిద్దరి ఫొటోలు నెట్టింట లీక్‌ అయ్యాయి. వాటిని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. ప్రతిష్ఠాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపు ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. వాటికి మించి ఈ చిత్రం ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు.

అయితే శ్రీరామనవమికి ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వస్తుందని అంతా భావించారు. కానీ రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్‌ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన  కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి. షూటింగ్‌ సెట్‌లో ఏ విషయం లీక్‌ కాకూడదని చిత్ర బృందం భారీగా నిఘా పెట్టిందని, సెల్‌ ఫోన్లలకు అనుమతి లేదని నిబంధన పెట్టిందని టాక్‌ నడిచింది. అయినా ఫొటోలు లీక్‌ కావడం గమనార్హం. ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా యష్‌ కనిపించబోతున్నాడని టాక్‌. 

Samantha: కొద్దిమందిపై ప్రభావం చూపినా సంతోషమే కదా!


Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 27 , 2024 | 03:34 PM