మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rashmika Mandanna: సినిమాకే హైలెట్‌ సీన్  అది.. దాన్ని కూడా...!

ABN, Publish Date - Apr 05 , 2024 | 04:11 PM

‘ఆడవాళ్ల శరీరాకృతిపై ట్రోల్స్‌ చేేస వాళ్లంటే నాకు అసహ్యం’ అంటూ మండిపడ్డారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.  రణ్‌బీర్‌ కపూర్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అందుకుంది.

Rashmika Mandanna


‘ఆడవాళ్ల శరీరాకృతిపై ట్రోల్స్‌ చేేస వాళ్లంటే నాకు అసహ్యం’ అంటూ మండిపడ్డారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) . రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir kapoor) సరసన ఆమె నటించిన చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అందుకుంది. అలాగే ట్రోల్స్‌కూ గురైంది. ముఖ్యంగా సినిమాలోని కర్వాచౌత్‌ సన్నివేశంలో రష్మిక ఓ చోట డైలాగ్‌ సరిగా చెప్పలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. తాజాగా దీనిపై రష్మిక స్పందించారు.

Rashmika Mandanna: ర‌ష్మిక జ‌న్మ‌దినం.. సోష‌ల్ మీడియాలో ‘శ్రీవ‌ల్లి’ ర‌చ్చ



‘ఆడవాళ్ల శరీరాకృతిపై ట్రోల్స్‌ చేసే  వాళ్లంటే నాకు చిరాకు. యానిమల్‌లో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్‌ డెలివరీ బాలేదని కామెంట్స్‌ చేశారు. కర్వాచౌత్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌. ఆ సన్నివేశంలో నేనెంతో కష్టపడి నటించాను. ఆ ఒక్క సీన్‌లోనే ఎన్నో రకాల ఎమోషన్స్‌ పలికించాలి. అందులో నా నటన చూసి సెట్‌ అంతా చప్పట్లతో మారుమోగింది. థియేటర్‌లోనూ అంతే రెస్పాన్స్‌ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంతోమందికి నచ్చిన ఆ సీన్‌పై కొందరు విమర్శల కురిపించారు. 9 నిమిషాల సీన్‌లో 10 సెకండ్ల డైలాగ్‌ బాలేదని నన్ను విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. అయితే వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నేను గిరి గీసుకొని ఉండాలనుకోవడం లేదు. ఎవరి అభిరుచి వారిది. అందరికీ అన్నీ నచ్చలనే రూల్‌ ఏమీ లేదు’’ అంటూ బదులిచ్చారు.ఇదే విషయంపై గతంలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా మాట్లాడారు. ‘‘యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేం కాదు. ఒక్క సన్నివేశంలోనే చాలా ఎక్స్‌ప్రెషన్స పలికించాలి. నవ్వడం, అరవడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. వాటిని రష్మిక న్యాయం చేసింది’’ అని  ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.


Updated Date - Apr 05 , 2024 | 04:35 PM