Rashmika Mandanna: ర‌ష్మిక జ‌న్మ‌దినం.. సోష‌ల్ మీడియాలో ‘శ్రీవ‌ల్లి’ ర‌చ్చ

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:03 PM

క‌న్న‌డ క‌స్తూరి రష్మిక మందన్నా జ‌న్మ‌దినం నేడు (శుక్ర‌వారం). ఈ నేప‌థ్యంలో హ్యాపీ బ‌ర్త్ డే ర‌ష్మిక పేరుతో సోష‌ల్ మీడియా మారు మ్రోగుతోంది.

Rashmika Mandanna: ర‌ష్మిక జ‌న్మ‌దినం.. సోష‌ల్ మీడియాలో ‘శ్రీవ‌ల్లి’ ర‌చ్చ

యానిమ‌ల్ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న క‌న్న‌డ క‌స్తూరి మన రష్మిక మందన్నా (#RashmikaMandanna) జ‌న్మ‌దినం నేడు (శుక్ర‌వారం). ఈ నేప‌థ్యంలో హ్యాపీ బ‌ర్త్ డే ర‌ష్మిక (#HBDRashmikaMandanna) పేరుతో మారు మ్రోగుతోంది.

rashm.jpeg

అంతేకాకుండా ఆమె అప్ క‌మింగ్‌ సినిమాల‌కు సంబంధించిన కొత్త అప్డేట్‌లతో సోష‌ల్ మీడియా బ‌ద్ద‌లు అవుతుంది. అమె న‌టిస్తోన్న తెలుగు చిత్రాల‌కు చెందిన ఫ‌స్ట్‌లుక్‌లు రిలీజ్ చేస్తూ ఆయా చిత్రాల టీమ్స్‌ రష్మిక జ‌న్మ‌దినాన్ని మ‌రింత క్రేజ్‌గా మార్చేశాయి.

rashimika srivalli.jpeg


ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ష్మిక మందన్నా (Rashmika Mandanna) న‌టిస్తోన్న మూడు పాన్ ఇండియా చిత్రాలు పుష్ప‌ 2 ది రూల్ (#Pushpa2TheRule) నుంచి శ్రీవ‌ల్లి లుక్‌ను రిలీజ్ చేయ‌గా, ఆ త‌ర్వాత ది గీతా ఆర్ట్స్ (Geetha Arts) వారి గ‌ర్ల్ ఫ్రెండ్ (The Girlfriend), నాగార్జున‌, ధ‌నుష్‌ల‌తో న‌టిస్తోన్న కుబేరా (Kubera) చిత్రాల నుంచి కూడా పోస్ట‌ర్లు రిలీజ్ చేసి ప్ర‌త్యేకంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

gf.jpeg

దీంతో సోష‌ల్ మీడియాలో ఈరోజు ర‌ష్మిక (Rashmika Mandanna) నామ జ‌పం జ‌రుపుతుండ‌గా.. సామాజిక మాధ్యాల్లో ర‌ష్మిక పేరు #HappyBirthdayRashmika ప్ర‌థ‌మ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్‌, సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌లు వెళ్లువ‌లా వ‌స్తున్నాయి.

GKXwbesXcAANBTN.jpeg

Updated Date - Apr 05 , 2024 | 12:03 PM