Ranbir Kapoor: కసరత్తులు మొదలు.. ఫొటోలు వైరల్‌!

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:28 PM

‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్న రణ్‌బీర్‌ తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందించనున్న ‘రామాయణ’ కోసం బిజీ అవుతున్నారు.

Ranbir Kapoor: కసరత్తులు మొదలు.. ఫొటోలు వైరల్‌!
Ranbir Kapoor


‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్న రణ్‌బీర్‌ (Ranbir kapoor) తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari)దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందించనున్న ‘రామాయణ’ (Ramayana) కోసం బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన లుక్‌ కోసం జిమ్‌లో శ్రమిస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత ట్రైనర్‌ శివోహం.. ‘యానిమల్‌’ నుంచి ‘రామాయణ’ వరకు రణ్‌బీర్‌ ఎంతో చమటోడ్చారు అని రాసుకొచ్చారు.

‘మూడు సంవత్సరాల నుంచి రణ్‌బీర్‌ ఎంతో కష్టపడుతున్నారు. జీవితంలో షార్ట్‌కట్‌లు తీసుకోవడం వల్ల  సాధించేది ఏమీ ఉండదు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళిక అవసరం. ఆయన సంకల్పం చాలా గొప్పది. మీతో ఇన్నేళ్ల నా ప్రయాణం మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. తదుపరి బ్లాక్‌బస్టర్‌కు ముందుగానే శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చారు. ‘యానిమల్‌’ లుక్‌ను కొత్త ఫొటోతో పోలుస్తూ ఒక ఇమేజ్‌ను షేర్‌ చేశారు. దీనికి ‘రామాయణ ది ఫిల్మ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ లుక్‌ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక ఇటీవల ఈ బాలీవుడ్‌ హీరో విలువిద్య నేర్చుకుంటున్న ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా కోసం  కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేశారు.

Ramanaya.jpg

భారీ తారాగణంలో రూపొందుతున్న ‘రామాయణ’ అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలపాటు ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకొన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ముంబయిలోని చిత్రీకరణ మొదలైంది. ఇందులోని నటీనటులు లుక్స్‌ లీక్‌లు కాకుండా ఉండేందుకు సెట్స్‌లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. దీనికి తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌,  కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు టాక్‌ నడుస్తోంది.  మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి మొదటి పార్ట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - Apr 25 , 2024 | 06:24 PM