మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Ramayana: రామాయణం అఫీషియల్‌గా అప్పుడే!

ABN , Publish Date - Mar 02 , 2024 | 05:17 PM

'రామాయణం’ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడం అన్నది అల్లు అరవింద్‌కు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దీనిపై ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ దర్శకత్వంలో వహించనున్నారు.

Ramayana: రామాయణం అఫీషియల్‌గా అప్పుడే!

'రామాయణం’ (Ramayana) చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడం అన్నది అల్లు అరవింద్‌కు (Allu aravind) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దీనిపై ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్‌ వార్తలోకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్‌లో రానుందని తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా గురించి ప్రకటన రానుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఇందులో నటీనటులు ఎవరనే విషయాన్ని నిర్మాణ సంస్థలు ప్రకటించలేదు. ఏప్రిల్‌ 17న ప్రధాన పాత్రలు ఎవరు చేయనున్నారనే విషయాన్ని తెలియజేయనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


Allu aravind.jpg
ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor), సీతగా సాయిపల్లవి, (Sai pallavi) రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ దేవోల్‌, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2025 దీపావళికి మొదటి పార్ట్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట.  వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీతో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం ప్రయత్నిస్తోందనీ, అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది.

Updated Date - Mar 02 , 2024 | 05:43 PM