Rakul Preet Singh: భారీ బడ్జెట్‌ చిత్రం కోసం రకుల్‌ పేరు? 

ABN , Publish Date - Feb 10 , 2024 | 06:16 PM

అందాల నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul preet singh) పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఆమె పెళ్లిపై వస్తోన్న వార్తలతోపాటు తాజాగా ఓ భారీ బడ్జెట్‌ చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి  అల్ల్లు అరవింద్‌ రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు

Rakul Preet Singh: భారీ బడ్జెట్‌ చిత్రం కోసం రకుల్‌ పేరు? 

అందాల నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul preet singh) పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఆమె పెళ్లిపై వస్తోన్న వార్తలతోపాటు తాజాగా ఓ భారీ బడ్జెట్‌ చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి  అల్ల్లు అరవింద్‌ రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.  నితేశ్‌ తివారీ  దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం రకుల్‌ను సంప్రదించినట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ దాదాపుగా ఖాయమయ్యారని సమాచారం సీత పాత్ర కోసం సాయి పలక్లవి, జాన్వీకపూర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శూర్పణఖ పాత్రలో రకుల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పాత్ర కోసం మూవీ యూనిట్‌ ఆమెను సంప్రదించగా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. 

Rakul.jpg

త్వరలోనే లుక్‌ టెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రావణుడిగా యశ్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి హనుమంతుడిగా బాబీ దేవోల్‌ కనిపించనున్నట్లు సమాచారం.  ఈ చిత్రంలో రకుల్‌ పేరు వినిపించడం ట్రెండ్‌ కావడానికి ఓ కారణం కాగా, మరోవైపు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లికి సంబంధించిన వార్త కూడా ప్రస్తుతం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో చక్కర్లు కొడుతోంది. జాకీ భగ్నానీతో రకుల్‌ పెళ్లి ఫిబ్రవరి 22న గోవాలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్ల జరగనుందని ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రకుల్‌ తన స్నేహితులకు గోవాలో పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పొటోలు కూడా నెట్టింట వైరల్‌ అయింది. 

Updated Date - Feb 10 , 2024 | 06:17 PM