Mirzapur 3: వెయిటింగ్‌కు తెర పడినట్లే!

ABN , Publish Date - May 29 , 2024 | 09:04 AM

'మీర్జాపుర్‌'(Mirzapur 3)వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో ఎంతగా సంచలనం  సృష్టించింతో తెలిసిందే. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వీడియోలో భారీ విజయం సాధించిన వెబ్‌ సిరీస్‌లలో ‘మీర్జాపుర్‌’ ఒకటి.

Mirzapur 3:  వెయిటింగ్‌కు తెర పడినట్లే!

'మీర్జాపుర్‌' (Mirzapur 3) వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో ఎంతగా సంచలనం సృష్టించింతో తెలిసిందే. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వీడియోలో భారీ విజయం సాధించిన వెబ్‌ సిరీస్‌లలో ‘మీర్జాపుర్‌’ ఒకటి. అత్యధిక రన్ టైమ్‌తోపాటు కోట్లలో వ్యూస్‌ దక్కించుకున్న ఇండియన్‌ సిరీస్‌గా మీర్జాపూర్‌ నిలిచింది. యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripati), అలీ ఫజల్‌, దివ్యేందు, విక్రాంత్‌ మాసే, కుల్‌ భూషణ్‌ ఖర్బంద, రసిక దుగ్గల్‌, శ్వేత త్రిపాఠి, ఇషా తల్వార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్‌ ఆయుష్మాన్‌, పునీత్‌ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నఈ సిరీస్‌ కు కరణ్‌ అనుష్మాన్‌తో పాటు గుర్మిత్‌ సింగ్‌, మిహిర్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించారు.

Mirza.jpg

ఇప్పటికే ఈ సిరీస్‌ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మీర్జాపూర్‌ మూడో సీజన్‌ గురించి అప్డేట్‌ ఇచ్చింది. మీర్జాపూర్‌ సీజన్‌ 3 కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. కుర్చీపై కూర్చున్న అలీ ఫైజల్‌ లుక్‌ బాగా వైరల్‌ అవుతుంది. ఈ ఏడాది జూన్‌, జులై నెలల్లో ఈ సీజన్‌ 3 స్ట్రీమింగ్   వచ్చే అవకాశం వుంది.ఈ సీజన్‌ లో గత రెండు సీజన్‌లకు మించి ట్విస్టులు ఉండనున్నట్లు సమాచారం.
Mad.jpeg

Updated Date - May 29 , 2024 | 10:08 AM