Keerthy Suresh: బేబి జాన్‌’ సెట్స్‌లో బేబి కీర్తి

ABN , Publish Date - Apr 20 , 2024 | 10:41 AM

దక్షిణాదిలో కథానాయికగా గుర్తింపు పొంది ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు మహానటి ఫేం కీర్తి సురేష్‌(Keerthy Suresh).  వరుణ్‌ ధావన్‌ (Varun హీరోగా తెరకెక్కుతున్న ‘బేబి జాన్‌’తో (babu john) ఆమె బాలీవుడ్‌కి పరిచయం కానుంది.

Keerthy Suresh:  బేబి జాన్‌’ సెట్స్‌లో బేబి కీర్తి

దక్షిణాదిలో కథానాయికగా గుర్తింపు పొంది ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు మహానటి ఫేం కీర్తి సురేష్‌(Keerthy Suresh).  వరుణ్‌ ధావన్‌ (Varun హీరోగా తెరకెక్కుతున్న ‘బేబి జాన్‌’తో (babu john) ఆమె బాలీవుడ్‌కి పరిచయం కానుంది.  కాలీస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా కొత్త షెడ్యూల్‌ మొదలైంది. ఈ షూటింగ్‌లో కీర్తి పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఆమె షేర్‌ చేశారు.

Siddharth-Aditi rao Hydari: నిశ్చితార్థం తర్వాత తొలిసారి.. జంటగా..


ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ‘‘బేబి జాన్‌’ సెట్స్‌లో బేబి కీర్తి’ అంటూ రాసుకొచ్చింది. బేబి కీర్తి అనే పేరున్న దుస్తులు ధరించి ఎంతో ఎనర్జీగా సందడి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్‌ ఎంట్రీ ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేయాలనుకున్నారు కానీ పలు కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి తమిళంలో మూడు, చిత్రాలతో బిజీగా ఉంది.

Updated Date - Apr 20 , 2024 | 10:43 AM