Varun Sandesh: ఆకట్టుకుంటోన్న.. వరుణ్ సందేశ్ ‘నింద’ పోస్టర్

ABN , Publish Date - Apr 19 , 2024 | 07:30 PM

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ హీరోగా రాబోతున్నారు.

Varun Sandesh: ఆకట్టుకుంటోన్న.. వరుణ్ సందేశ్ ‘నింద’ పోస్టర్
varun sandesh

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా రాబోతున్నారు.

varun.jpeg

యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ (Nindha) అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం (Rajesh Jagannadham) నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ (The Fervent Indie Productions) బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను టీం విడుదల చేసింది.

nindha.jpeg

కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే ఎన్నో హింట్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఊరి వాతావరణం, ఆ చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం కూడా కనిపిస్తోంది.


ఇలా పోస్టర్‌తోనే ఎంతో ఆసక్తికిని రేకెత్తించారు. ఇక ఈ మూవీని ఆల్రెడీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు చూపించారు. వారంతా కూడా సినిమాను మెచ్చుకున్నారు. మంచి కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించారని దర్శక నిర్మాతను ప్రశంసించారు. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Apr 19 , 2024 | 07:30 PM