Sharvari: ఆయనతో.. మళ్లీ పని చేయాలని ఉంది

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:18 PM

అభ‌య్ వ‌ర్మ‌, శర్వారి హీరోహీరోయిన్లుగా సత్య రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టింటిన బాలీవుడ్ చిత్రం ‘ముంజ్యా’ . జూన్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఈ సంద‌ర్భంగా క‌థానాయిక శర్వారి సత్య రాజ్‌తో పని చేసిన అనుభవం గురించి చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.

Sharvari: ఆయనతో.. మళ్లీ పని చేయాలని ఉంది
munjya

అభ‌య్ వ‌ర్మ‌ (Abhay Verma), శర్వారి (Sharvari) హీరోహీరోయిన్లుగా సత్య రాజ్ (Sathyaraj) కీల‌క పాత్ర‌లో న‌టింటిన బాలీవుడ్ చిత్రం ‘ముంజ్యా’ (Munjya). భార‌త‌దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న క‌థ‌ల‌ను అధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆదిత్య సర్పోత్దార్ (Aditya Sarpotdar) దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు.

MV5BYTNjZDY2ODEtZTk2Yy00MjAyLWJlNWQtODM2NzdmYmE0ODJjXkEyXkFqcGc@._V1_.jpg

2024 జూన్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా క‌థానాయిక శర్వారి బాహుబలితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కట్టప్పగా ఫేమస్ అయిన సత్య రాజ్‌తో పని చేసిన అనుభవం గురించి చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.


‘ఎస్ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసిన బాహుబలి (Baahubali)కి వీరాభిమానిని. ఆ మూవీని ఎన్నో సార్లు చూశాను. ఇక ఈ చిత్రంలో కట్టప్పగా చేసిన సత్య రాజ్ (Sathyaraj) గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నానని తెలియడంతో ఎంతో సంతోషించాను.సెట్‌లో మొదటి రోజు నుండి సత్యరాజ్ అంకితభావం, నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానని.. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా అన్నారు.

GOmP6sfXwAEAvBu.jpeg

సత్యరాజ్ (Sathyaraj) సర్‌ని సెట్‌లో చూడటంతో ప్రతిరోజూ యాక్టింగ్ వర్క్‌షాప్‌కు హాజరైనట్లుగా ఉంది. అతని బహుముఖ ప్రజ్ఞ, సహనం, పరిపూర్ణ ప్రతిభ అన్నిటినీ మించిపోయింది. అది కామిక్ సీన్ అయినా లేదా ఇంటెన్స్ మూమెంట్ అయినా, సత్యరాజ్ సర్ ఎంతో సెటిల్డ్‌గా ప్రతి సన్నివేశానికి జీవం పోశార‌న్నారు. ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉంది. అలాంటి అవకాశం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 05:19 PM