సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ananya Pandey: జాన్వీలా చేయడం అసాధ్యం

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:59 PM

ఇటీవల రీలీజైన పాన్ ఇండియా చిత్రం దేవరలో ఆమె హొయలు ఒలికించి అభిమానులని మంత్రముగ్దుల్ని చేసింది. అయితే ఆమె పాత్రకు సినిమాలో తగిన ప్రాముఖ్యతతో పాటు పెద్ద స్కోప్ లేదని విమర్శలొచ్చాయి. ఆమె పాత్రా నిడివిపై కూడా అసహనం వ్యక్తం చేశారు. కాగా ఓ బాలీవడ్ బ్యూటీ వీటిపై రియాక్టై జాన్వీని పొగడ్తలతో ముంచెత్తారు.

JAHNAVI AND ANANYA

'దేవర'(Devara) సినిమాతో తనదైన అందం, అభినయంతో తెలుగు వారికి తెరపై పరిచయమైనా సితార జాన్వీ కపూర్(Janhvi Kapoor). అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఈమె తెలుగు వారికి చాలా ప్రత్యేకం. ఇటీవల రీలీజైన పాన్ ఇండియా చిత్రం దేవరలో ఆమె హొయలు ఒలికించి అభిమానులని మంత్రముగ్దుల్ని చేసింది. అయితే ఆమె పాత్రకు సినిమాలో తగిన ప్రాముఖ్యతతో పాటు పెద్ద స్కోప్ లేదని విమర్శలొచ్చాయి. ఆమె పాత్రా నిడివిపై కూడా అసహనం వ్యక్తం చేశారు. కాగా ఓ బాలీవడ్ బ్యూటీ వీటిపై రియాక్టై జాన్వీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ ఆమెవరు.. ఏమంది అంటే..


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే(Ananya Pandey) ఎదో ఒక వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. తాజాగా ఆమె నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ కంట్రోల్(CTRL) ప్రమోషన్లో ఆమె బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ గురించి అడిగిన ఓ ప్రశ్నకి సమాధానమిస్తూ.. 'కమర్షియల్‌ సినిమాల్లో నటించడం సులభమని ప్రేక్షకులు భావిస్తారు. కానీ, అలాంటి సినిమాల్లో నటించడం అనేది ఒక కళ. జాన్వీ (Janhvi Kapoor) ఇటీవల వచ్చిన ‘దేవర’లో అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి ‘చుట్టమల్లే..’ సాంగ్‌లో ఆమె హావభావాలు చాలా బాగున్నాయి. ఒకే సమయంలో డ్యాన్స్‌లో అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం కష్టం’ అంటూ ఆకాశానికెత్తింది.


ఇక తన కంట్రోల్ సినిమా గురించి మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు నేను ప్రేక్షకుడి కోణం నుంచి ఆలోచిస్తాను అందుకే ఈ కథను నమ్మి ప్రేక్షకుల ముందుకొస్తున్న అన్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ప్రయోగాలు చేస్తేనే ఎదుగుతారని చెప్పారు. కాగా ఈ మూవీలో అనన్య.. అవస్థి క్యారెక్టర్లో కనిపిస్తుండగా.. విహాన్‌ సుమత్‌ కీలకపాత్ర పోషించారు. స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి సెన్సేషనల్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ కమెడియన్ సుముఖి సురేష్ కథ అందించటం విశేషం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చదవండి

Updated Date - Jun 23 , 2025 | 05:18 PM