Ajay Devagan: ఒకటి కాదు.. రెండు కాదు..  ఏకంగా ఎనిమిది..!

ABN , Publish Date - Apr 04 , 2024 | 03:14 PM

సినీ పరిశ్రమ సీజనల్‌గా ముందుకెళ్తుంటుంది. ఓ ఫార్ములా సినిమా సక్సెస్‌ అయితే ఆ జానర్‌ చిత్రాలపైనే దృష్టి సారిస్తుంటారు మేకర్స్‌. అలాగే హిట్‌ సినిమాలకు ఫ్రాంచైజ్‌లు వస్తుంటాయి. మొదటిభాగం హిట్‌ అయ్యిందంటే, తర్వాత వచ్చే చిత్రాలపై అంచనాలు భారీగా ఉంటాయి.

Ajay Devagan: ఒకటి కాదు.. రెండు కాదు..  ఏకంగా ఎనిమిది..!


సినీ పరిశ్రమ సీజనల్‌గా ముందుకెళ్తుంటుంది. ఓ ఫార్ములా సినిమా సక్సెస్‌ అయితే ఆ జానర్‌ చిత్రాలపైనే దృష్టి సారిస్తుంటారు మేకర్స్‌. అలాగే హిట్‌ సినిమాలకు ఫ్రాంచైజ్‌లు వస్తుంటాయి. మొదటిభాగం హిట్‌ అయ్యిందంటే, తర్వాత వచ్చే చిత్రాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay devagan)ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఒక పక్క హీరోగా చేస్తూనే మరోవైపు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌ నటుడే అయినా 'ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అజయ్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ ఫీట్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌లో నటించేందుకు సిద్థమవుతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల జాబితాలో ఉన్నవి ఎక్కవగా సీక్వెల్స్‌ కావడం విశేషం. ఈ ఏడాది ‘షైతాన్‌’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే ‘మైదాన్‌’ (maidhan)తోనూ అలరించేందుకు సిద్థమయ్యారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Ajay.jpg

దీని తర్వాత ఆయన నటించే సినిమాలన్నీ సీక్వెల్సే. రాజ్‌కుమార్‌ గుప్త దర్శకత్వంలో ‘రైడ్‌’ మూవీ కొనసాగింపుగా ‘రైడ్‌ 2’ రాబోతోంది. వాణీకపూర్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగం అగైన్‌’ ఇప్పటికే సెట్స్‌పై ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఆగస్టులో విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ‘గోల్‌మాల్‌ 4’, ‘గోల్‌మాల్‌-5’లకు సంబంధించి కూడా స్క్రిప్ట్  పనులు పూర్తయ్యాయి. రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ‘దే దే ప్యార్‌ దే-2’ రాబోతోంది. ఇందులో వయసు అంతరం ఉన్న ప్రేమికుడిగా మరోసారి అలరించేందుకు ఆయన సిద్థమవుతున్నారు. ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’కు కొనసాగింపుగా  మరో మూవీ పట్టాలెక్కనుంది. వర్తమానంలో జరిగే కథతో ఇది ప్రేక్షకుల ముందుకురానుందని బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 3’ని దర్శకుడు జీతూ జోసెఫ్‌ రెడీ చేస్తున్నారు. అక్కడ స్క్రిప్ట్  పనులు పూర్తయిన వెంటనే అజయ్‌ బాలీవుడ్‌లోనూ షురూ చేసే పనిలో ఉన్నారు.

Boney Kapoor: శ్రీదేవి ప్రైవేట్‌ పర్సన్ .. బయటకు చెప్పడం ఆమెకు నచ్చదు!


ఇక తాజగా విజయం సాధించిన  ‘షైతాన్‌’కు కొనసాగింపుగా ‘షైతాన్‌ 2’ను కూడా తీసుకురావాలని అజయ్‌ దేవగణ్‌ భావిస్తున్నారని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అయితే, దానికి కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం అనుకున్న మూవీని పూర్తయిన తర్వాతే దీన్ని తెర మీదకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అజయ్‌ దేవగణ్‌ ఓ నిర్మాత కావడం విశేషం. అమిత్‌శర్మ దర్శకత్వంలో అజయ్‌ నటించిన తాజా చిత్రం ‘మైదాన్‌’ రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ప్రియమణి, గజరాజ్‌రావ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సయ్యద్‌ అబ్దుల్‌ రహీం బయోపిక్‌గా దీన్ని రూపొందించారు. అజయ్‌ ఇందులో ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు. 

Updated Date - Apr 04 , 2024 | 03:15 PM