World Famous Lover: అభిషేక్ నామాకి కౌంటర్ ఇచ్చిన విజయ్ తండ్రి

ABN , First Publish Date - 2023-09-08T12:06:06+05:30 IST

నిర్మాత అభిషేక్ నామా నటుడు విజయ్ దేవరకొండ మీద చేసిన కామెంట్స్ కి విజయ్ తండ్రి స్పందించి నిర్మాత కేవలం తన కుమారుడిని అనవసరంగా చెడ్డ చెయ్యాలని చూస్తున్నాడు అని చెప్పాడు. అభిషేక్ చేస్తున్న బ్లాక్ మెయిల్ పద్ధతులు నడవవు అని సంచలన ప్రకటన చేసాడు విజయ్ తండ్రి.

World Famous Lover: అభిషేక్ నామాకి కౌంటర్ ఇచ్చిన విజయ్ తండ్రి
Abhishek Nama and Vijay's father Deverakonda Govardhan Rao

నిర్మాత అభిషేక్ నామా (AbhishekNama) తన సాంఘీక మాధ్యమంలో ఎప్పుడో తాను డిస్ట్రిబ్యూట్ చేసిన విజయ్ దేవరకొండ (VijayDeverakonda) సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' #WorldFamousLover ఫ్లాపు అయిందని, ఆ సినిమాకి చాలా నష్టం వచ్చిందని అందుకు విజయ్ సహాయం కావాలని ట్వీట్ పెట్టాడు. ఆ సినిమా ఫ్లాపులొ విజయ్ దేవరకొండకి సంబంధం లేకపోయినా కావాలనే అతని పేరు పాడుచెయ్యడానికి విజయ్ ని ఇలా లాగుతున్నాడు అని విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు (GovardhanaRao) ఆరోపించారు. వైజాగ్ లో జరిగిన 'ఖుషీ' #Khushi విజయోత్సవ సభలో విజయ్ నూరు కుటుంబాలకి లక్ష చొప్పిన ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దానికి అభిషేక్ నామ వ్యంగంగా తన సాంఘీక మాధ్యమంలో ట్వీట్ చేస్తూ తమని కూడా ఆదుకోవాలని అన్నాడు. దీనికి విజయ్ అభిమానులు అభిషేక్ నామాని ట్రోల్ చేశారు కూడా. అయితే విజయ్ తండ్రి గోవర్ధన రావు (GovardhanaRao) ఒక ఆంగ్ల దినపత్రిక మాట్లాడుతో అభిషేక్ నామా వి బ్లాక్ మెయిల్ కుతంత్రాలు అని, అవి పని చెయ్యవు అని ఒక సంచలన ప్రకటన చేసాడు.

vijaydeverakonda2.jpg

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా విడుదల తరువాత విజయ్ తన పారితోషికంతో చాలా భాగం తీసుకోలేదని, అది నిర్మాత కెఎస్ రామారావు (KSRamaRao) కి కూడా తెలుసనీ చెప్పాడు రావు. తరువాత అభిషేక్ నామా ని కూడా కలిశామని కూడా చెప్పాడు. ఒక పక్క 'ఖుషీ' సినిమా కలెక్షన్స్ పడిపోయాయని అభిషేక్ నామా చెపుతున్నాడు అన్నదానికి, "అభిషేక్ నామాకి 'ఖుషి' సినిమా కలెక్షన్స్ కి ఏమిటి సంబంధం. అతను విజయ్ మార్కెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర పడిపోయింది అని అంటూనే, తనకి అవకాశం ఇస్తే సినిమా చేస్తా అంటున్నాడు. మరి విజయ్ కి మార్కెట్ లేనప్పుడు విజయ్ తో సినిమా ఎలా చేస్తాను అని అంటాడు. అంటే అతను రెండు నాలుక ధోరణి తో మాట్లాడుతున్నాడు, కావాలనే విజయ్ ని టార్గెట్ చేసాడు," అని విజయ్ తండ్రి సంచలన మాటలు చెప్పాడు.

అభిషేక్ నామా తన కొడుకుతో సినిమా తీయటానికి వచ్చినప్పుడు, విజయ్ పెద్ద నిర్మాతలు అయిన దిల్ రాజు (DilRaju), మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers), గీత ఆర్ట్స్ (GeethaArts) తో సినిమాలు ఒప్పుకున్నాడు అని, అప్పుడు డేట్స్ కాళీ లేవని చెప్పను, అది నిజం కూడాను. "అయితే ఇప్పుడు అభిషేక్ నామాతో సినిమా చేసే ప్రసక్తే లేదు, అతనితో పని చెయ్యం," అని కరాకండీగా చెప్పేసాడు విజయ్ తండ్రి. ఇంకో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ (SunilNarang) గురించి మాట్లాడుతూ, అతను పెద్ద మనిషి, అతనికి పరిశ్రమలో ఒక పేరుంది. "అతనితో సినిమా కచ్చితంగా చేస్తాడు విజయ్, సరైన కథ, దర్శకుడు కుదిరితే," అని చెప్పాడు గోవర్ధన రావు.

Updated Date - 2023-09-08T12:06:06+05:30 IST