సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

ABN, First Publish Date - 2023-04-11T15:54:14+05:30

అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) ఈ సినిమా సమయంలో ఏం చెప్పారంటే.. నాకు ‘దాయి దాయి దామ్మా’ పాటలోని వీణ స్టెప్‌లా.. మంచి స్టెప్స్‌తో చరణ్ బాబుకి ఓ సాంగ్ కంపోజ్ చేయాలని చెప్పారు. ఈ సాంగ్ కంటే ముందు

Raghava Lawrence about Chiru and Charan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండే సింపుల్ పర్సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అని అన్నారు యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). ఆయన కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ (Rudrudu). పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా ఉన్నప్పటి కొన్ని ఫొటోలను డిస్‌ప్లే చేసి.. ఆ పిక్స్ గురించి చెప్పాల్సిందిగా లారెన్స్‌ను యాంకర్ కోరింది.

ముందుగా మెగాస్టార్‌తో ఉన్న పిక్ గురించి లారెన్స్ మాట్లాడుతూ (Raghava Lawrence about Chiranjeevi).. ‘‘ఇది ముఠామేస్త్రి సినిమాలోని ఫొటో. ఫస్ట్ టైమ్ నేను అన్నయ్య చిరంజీవిగారితో గ్రూప్ డ్యాన్స్ చేసినప్పటి ఫొటో ఇది. పాటలో గ్రూపు డ్యాన్సర్స్‌లో నేను 5వ వరుసలో ఉన్నాను. చిరంజీవిగారు లేకుంటే నేను తెలుగులో పెద్ద డాన్స్ మాస్టర్‌ని అయ్యేవాడినే కాదు. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవిగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. థ్యాంక్యూ సో మచ్ అన్నయ్యా’’ అని లారెన్స్ చెప్పుకొచ్చారు.

తర్వాత రామ్ చరణ్ చిరుత సినిమాకు సంబంధించి స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోపై లారెన్స్ మాట్లాడుతూ (Raghava Lawrence about Ram Charan).. ‘‘చరణ్ బాబు ఫస్ట్ సినిమాలోది ఈ స్టిల్. పూరి జగన్నాధ్‌గారి దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ (Chirutha) లోనిది. అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) ఈ సినిమా సమయంలో ఏం చెప్పారంటే.. నాకు ‘దాయి దాయి దామ్మా’ పాటలోని వీణ స్టెప్‌లా.. మంచి స్టెప్స్‌తో చరణ్ బాబుకి ఓ సాంగ్ కంపోజ్ చేయాలని చెప్పారు. ఈ సాంగ్ కంటే ముందు కూడా ఇంట్లో చరణ్ బాబుతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఇప్పుడు చరణ్ బాబు వెళ్లే మార్గం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నా తమ్ముడులాంటి వాడు. చరణ్ బాబులో నాకు నచ్చింది ఏమిటంటే.. డౌన్ టు ఎర్త్ అంటారు కదా.. అలా ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉంటారు. చాలా సింపుల్‌గా ఉంటారు. చరణ్ బాబుకు ఇంకా మరింత పేరు రావాలని నేను నమ్ముకున్న రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నా’’నని అన్నారు. (Rudrudu Pre Release Event)


ఇవి కూడా చదవండి:

*********************************

*Samantha: నేను ఫేస్ చేసిన స‌మ‌స్య‌ల వ‌ల్లే.. ఇప్పుడిలా మారిపోయా!

*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

*MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం

*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..

*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

Updated Date - 2023-04-11T16:21:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!