Salaar: నైజాం కింగ్ ప్రభాస్! వసూళ్లు మామూలుగా లేదుగా!

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:02 PM

ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. నిన్న విడుదలైన 'సాలార్' సినిమా నైజాం ఏరియాలో మొదటి రోజు కలెక్షన్స్ లో రెండో అతి పెద్ద సినిమాగా నిలిచింది. మొదటి సినిమా మల్టీ స్టారర్ అయిన 'ఆర్ఆర్ఆర్' కాగా రెండోది 'సలార్'.

Salaar: నైజాం కింగ్ ప్రభాస్! వసూళ్లు మామూలుగా లేదుగా!
Prabhas film 'Salaar' is the second highest day one grosser in Nizam area

భారీ అంచనాల మధ్య నిన్న ప్రభాస్ సినిమా 'సలార్' #Salaar విడుదలయింది. ప్రశాంత్ నీల్ (PrashanthNeel) దర్శకుడు, హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు. ఈ సినిమాని నైజాం (NIzagArea) ఏరియా హక్కులు ప్రముఖ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) సుమారు రూ.60 కోట్లు పెట్టి తీసుకున్నారని వార్త. అలాగే నైజాం ఏరియాలో కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా అర్థరాత్రి ఒంటి గంట నుండే వెయ్యడం మొదలెట్టారు. అయితే ఈ ప్రీమియర్ షో టికెట్స్ ఆన్ లైన్ లో కాకుండా, డిస్ట్రిబ్యూటర్ కౌంటర్ దగ్గర మాత్రమే టికెట్స్ ఇచ్చేట్టు నిర్ణయం తీసుకున్నారని ఒక వార్త నడుస్తోంది. (Prabhas is the Nizag King)

Prabhas.jpg

అలాగే ఈ ప్రీమియర్ టికెట్ రేట్స్ కూడా చాలా ఎక్కువ రేట్స్ కు అమ్మారని ఇంకో వార్త హల్ చల్ చేస్తోంది, మరి అది ఎంతవరకు నిజమనేది నిర్వాహకులే చెప్పాలి. ఇక 'సలార్' మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా మరోసారి చూపించాడు అని అర్థం అవుతోంది. నైజాం కింగ్ ఎవరంటే ప్రభాస్ అని టక్కున చెప్పేస్తారు, ఆలా వున్నాయి 'సలార్' మొదటి రోజు కలెక్షన్స్. (Salaar Day one collections)

నైజాం ఏరియాలో మొదటి రోజు సలార్ రూ.22.55 కోట్ల షేర్ కలెక్టు చేసి అల్ టైమ్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 'ఆర్ఆర్ఆర్' #RRR రూ.23.35 కోట్ల షేర్ తో అగ్రస్థానంలో వుంది. అయితే 'ఆర్ఆర్ఆర్' మల్టీ స్టారర్ సినిమా అందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కథానాయకులు, రాజమౌళి దర్శకుడు. ఈ 'సలార్' సినిమా మొత్తం ప్రభాస్ పవర్ మీదే నడిచింది, రెండో స్థానంలో నిలిచింది, ప్రభాస్ సత్తా ఏంటో తెలిసింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా సుమారు రూ.40 కోట్ల షేర్ కలెక్టు చేసినట్టుగా ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. అలాగే ప్రపంచం మొత్తం మీద ఈ సినిమా సుమారు రూ.95 కోట్ల షేర్ కలెక్టు చేసి నెంబర్ వన్ సినిమాగా నిలిచింది అని కూడా ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.180 కోట్లు కలెక్టు చేసిందని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్టు అనేదే చిత్ర నిర్వాహకులకు, డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రమే తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Salaar movie review: ఇది కేవలం ప్రభాస్ అభిమానులకి మాత్రమే!

Updated Date - Dec 23 , 2023 | 12:02 PM