Panja Vaishnav Tej: ‘వరుణ్‌లవ్’ వెడ్డింగ్‌ పార్టీలో రీతూ వర్మ.. రూమర్స్‌కు వైష్ణవ్ చెక్

ABN , First Publish Date - 2023-11-19T13:33:03+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో కుటుంబ సభ్యుల, దగ్గరి బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందు జరిగిన వెడ్డింగ్ పార్టీలోనూ, పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్‌లోనూ టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ రీతూ వర్మ బాగా హైలెట్ అయింది. మెగా హీరోతో రిలేషన్‌ కారణంగా ఆమె ఇలా సందడి చేసిందనే రూమర్స్‌పై.. తాజాగా వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.

Panja Vaishnav Tej: ‘వరుణ్‌లవ్’ వెడ్డింగ్‌ పార్టీలో రీతూ వర్మ.. రూమర్స్‌కు వైష్ణవ్ చెక్
Ritu Varma and Panja Vaishnav Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవల ఇటలీలో కుటుంబ సభ్యుల, దగ్గరి బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందు జరిగిన వెడ్డింగ్ పార్టీలోనూ, పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్‌లోనూ టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ బాగా హైలెట్ అయింది. దీంతో ఆ హీరోయిన్ మెగా ఫ్యామిలీ (Mega Family)లోని ఓ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రీతూ వర్మ (Ritu Varma). ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఉన్న బ్యాచ్‌లర్ హీరోలు సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్. వీరిలో ఒకరితో రీతూ వర్మ రిలేషన్‌లో ఉందంటూ వస్తున్న వార్తలపై తాజాగా వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.

పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) హీరోగా శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). ఈ సినిమా నవంబర్ 24న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. నవంబర్ 24 విడుదలను పురస్కరించుకుని ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవ్ తేజ్ ముందు రీతూవర్మ‌కు సంబంధించి చక్కర్లు కొడుతున్న మ్యాటర్‌ను ప్రస్తావించగా.. ఆయన నవ్వి.. అలాంటి రిలేషన్స్ ఏమీ లేవని క్లారిటీ ఇచ్చారు.


Ritu-Varma.jpg

వరుణ్, లావణ్యల పెళ్లిలో, పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్‌లో రీతూ వర్మ సందడి చేయడానికి కారణం.. ఆమె లావణ్య త్రిపాఠికి మంచి ఫ్రెండ్ కావడమే అని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు. అంతే తప్ప.. బయట వార్తలలో వినిపిస్తున్నట్లుగా మా ఫ్యామిలీ హీరోలతో ఎటువంటి రిలేషన్‌లో ఆమె లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌కి వైష్ణవ్ చెక్ పెట్టాడు. అంతకు ముందు వైష్ణవ్ తేజ్‌కు, ఆయన నటించిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్ర హీరోయిన్, గ్లామర్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma)కు మధ్య కూడా సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలను కూడా వైష్ణవ్ అప్పట్లో ఖండించారు. కాగా, శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదికేశవ’ చిత్రంలో రుద్ర కాళేశ్వర్‌ రెడ్డిగా వైష్ణవ్ కనిపించనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*CWC23Final: మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలంటూ మీమ్స్.. ఎందుకంటే?

*******************************

*Raghava Lawrence: రజనీ రూపంలో రాఘవేంద్రుడిని చూశా..

*******************************

*Hi Nanna Party: పోటీలోకి ‘హాయ్ నాన్న’ పార్టీ.. మేనిఫెస్టో విడుదల

*******************************

*Rajinikanth: ‘ముత్తు’ రీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. థిల్లాన థిల్లాన దుమ్మురేపుతుందా..

*******************************

Updated Date - 2023-11-19T13:33:06+05:30 IST