Samantha: అప్పుడు మహేష్ ని విమర్శించావ్, మరి ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావ్ కదా అంటూ సమంతని ట్రోల్

ABN , First Publish Date - 2023-07-13T14:55:16+05:30 IST

దాదాపు పదేళ్ల క్రితం మహేష్ బాబు, కృతి సనన్ జంటగా నటించిన '1 నేనొక్కడినే' సినిమా పోస్టర్ మీద సమంత చేసిన ట్వీట్ మళ్ళీ ఇపుడు బయటకి తెచ్చారు. ఎందుకంటే ఇప్పుడు సమంత 'ఖుషీ' సినిమా పాటలో ....

Samantha: అప్పుడు మహేష్ ని విమర్శించావ్, మరి ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావ్ కదా అంటూ సమంతని ట్రోల్
Samantha

సమంత రుత్ ప్రభు (SamanthaRuthPrabhu) అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మంచి కారణానికి, కానీ ఎక్కువగా ఆమె ట్వీట్స్ లేదా వేరే వాళ్ళ గురించి కామెంట్ పెట్టినప్పుడు మాత్రం నెటిజన్స్ ఆడుకుంటూ వుంటారు ఆమెని. అందువల్ల సమంత (Samantha) వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఈ పరిణామంలోనే ఆమె చేసిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ ముందుకు తెచ్చి, ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ ఏమి జరిగింది అంటే, అప్పట్లో అంటే 2013 లో మహేష్ బాబు (MaheshBabu), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన '1 నేనొక్కడినే' #!Nenokkadine పోస్టర్ లు విడుదల చేశారు. అందులో మహేష్ బాబు బీచ్ లో నడుచుకుంటూ వెళుతుంటే వెనకాల కృతి సనన్ బంగురుకుంటూ వెళుతూ ఉంటుంది.ఈ పోస్టర్ చూసి, సమంత కామెంట్ చేసింది. "ఇప్పుడే ఇంకా విడుదల కానీ ఓ సినిమా పోస్టర్ చూసాను, అది ఎంత దారుణంగా వుంది అంటే, చెప్పలేనంత", అని కామెంట్ చేసింది. అది ఆడవాళ్ళని మరీ అలా చూపిస్తున్నారు అనే ఉద్దేశంతో సమంత ఆలా ట్వీట్ చేసింది అని అన్నారు.

samantha-class.jpg

అయితే ఇప్పుడు 'ఖుషీ' #Khushi సినిమా నుండి ఆరాధ్య #Aaradhya అనే పాటని విడుదల చేశారు. ఇందులో సమంత, విజయ్ దేవరుకొండ (VijayDeverakonda) లీడ్ పెయిర్ గా వేశారు. ఈ పాటలో విజయ్, సమంత భుజాన్ని కాలుతో గిల్లుతూ ఉంటాడు. దీని మీద నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ, అప్పట్లో సమంత మహేష్ బాబు, కృతి సనన్ పోస్టర్ మీద చేసిన కామెంట్ కి లింక్ పెట్టారు. "కర్మ మళ్ళీ వెనక్కి వచ్చింది" అనే అర్థం ఇస్తున్నారు. మరి ఇది మహిళలను కించపరిచినట్టు కాదా అని సమంతని అడుగుతున్నారు. అలాగే ఒకరిని కామెంట్ చేసే ముందు చూసుకోవాలి కదా అని కూడా కొందరు క్లాస్ పీకుతున్నారు.

ఇలా పదేళ్ల క్రితం సమంత వేసిన ట్వీట్ ని ఇప్పుడు తీసుకొచ్చి, ఆమె 'ఖుషీ' లో చేసిన పాటల్లో సన్నివేశానికి ముడిపెడుతూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు సాంఘీక మాధ్యమంలో.

Updated Date - 2023-07-13T14:55:16+05:30 IST