Bhagavanth Kesari: బాలకృష్ణ సినిమా ఏడు రోజుల కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-10-26T15:02:54+05:30 IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'భగవంత్ కేసరి' విడుదలై ఇప్పటికే వారం రోజులు అయింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్టు చేసింది, ప్రాంతాల వారీగా ఎంత కలెక్టు చేసిందో పూర్తి వివరాలు.

Bhagavanth Kesari: బాలకృష్ణ సినిమా ఏడు రోజుల కలెక్షన్స్
Balakrishna from Bhagavanth Kesari film

అనుకున్నట్టుగానే నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) నటించిన 'భగవంత్ కేసరి' #BhagavanthKesari దసరా విన్నర్ అవటమే కాకుండా, కలెక్షన్స్ లోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది. అనిల్ రావిపూడి (AnilRavipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కథానాయిక కాగా, శ్రీలీల (Sreeleela) ఒక ప్రముఖ పాత్రలో కనపడింది. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో విడుదలైంది. మొదటి నుండి ఈ సినిమా విజయం సాధిస్తుంది అని చాలా గట్టి నమ్మకంతో వున్న బాలకృష్ణ, దర్శకుడు అనిల్ నమ్మకాన్ని నిజం చేసింది.

ఈ సినిమాలో బాలకృష్ణ ఒక సన్నివేశంలో చెప్పిన గుడ్ టచ్, బేడ్ టచ్ అందరినీ బాగా ఆకర్షించడమే కాకుండా, అది బాలకృష్ణ లాంటి పెద్ద నటుడితో చెప్పించటం ఇంకా బాగుంది అని అంటున్నారు. అలాగే ఇందులో బాలకృష్ణ, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగంతో ఉన్నాయని కూడా అంటున్నారు. చివర్లో శ్రీలీల పోరాట సన్నివేశాలు కూడా బాగా చేసిందని చెపుతున్నారు.

Bhagavanth-Kesari.jpg

ఈ సినిమా ఒక వారం బాగా ఆడి ఆ తరువాత కలెక్షన్స్ పడిపోయే సినిమా కాదని, చాలారోజులు గుర్తుండిపోయే సినిమా అని అందుకే ఈ సినిమాకి లాంగ్ రన్ ఉందని ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చెపుతున్నాయి. ఇప్పుడు ఏడు రోజులకి గాను ఈ సినిమా రూ. 56.43 కోట్ల రూపాయలు షేర్ కలెక్టు చేసిందని అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ వారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుందని చెపుతున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. నైజాం ఏరియాలో ఇంతవరకు రూ. 14 కోట్లు కలెక్టు చేసిందని, ఈ ఏరియా హక్కులు నిర్మాత దిల్ రాజు (DilRaju) తీసుకున్నారని, అతనికి మంచి లాభాలు వస్తాయని చెపుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా చాలా బాగా నడిచిందని, అక్కడ ఇది బాలకృష్ణ సినిమాల్లో అగ్రగామిగా నిలుస్తుందని చెపుతున్నారు.

భగవంత్ కేసరి ఏడు రోజుల వరల్డ్ వైడ్ షేర్ #BhagavanthKesari 7 Days WW Share

నైజామ్: రూ. 14 కోట్లు

సీడెడ్: రూ. 11.42 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ. 4.53 కోట్లు

గుంటూరు: రూ. 5.25 కోట్లు

కృష్ణ: రూ. 2.82 కోట్లు

నెల్లూరు: రూ. 1.95 కోట్లు

ఈస్ట్ : రూ. 2.56 కోట్లు

వెస్ట్: రూ. 2.3 కోట్లు

కర్ణాటక: రూ. 4 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా: రూ. 0.6 కోట్లు

ఓవర్సీస్: రూ. 7 కోట్లు

మొత్తం: రూ 56.43 కోట్లు (Including Hires and GST)

Updated Date - 2023-10-26T15:02:54+05:30 IST