Manchu Lakshmi: స్విమ్‌సూట్‌లో మంచు ల‌క్ష్మి.. అక్కా ఏందీ అరాచ‌కమంటున్న నెటిజ‌న్లు

ABN , First Publish Date - 2023-12-17T13:32:52+05:30 IST

స‌మ‌యం దొరికితే చాలు మ‌న సినిమా తార‌లు చేసే హ‌డావుడి అంతాఇంతా ఉండ‌దు. చూసినోడికి చూసినంత అన్న‌ట్లుగా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో నెట్టింట ర‌చ్చ లేపుతుంది. వివ‌రాల్లోకి వెళితే

Manchu Lakshmi: స్విమ్‌సూట్‌లో మంచు ల‌క్ష్మి.. అక్కా ఏందీ అరాచ‌కమంటున్న నెటిజ‌న్లు
LAKSHMI MANCHU

స‌మ‌యం దొరికితే చాలు మ‌న సినిమా తార‌లు చేసే హ‌డావుడి అంతాఇంతా ఉండ‌దు. చూసినోడికి చూసినంత అన్న‌ట్లుగా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌ చేస్తుంటారు. ఒక‌రు డిఫ‌రెంట్‌గా ఏదైనా చేస్తే దాన్ని ఫాలో అవుతూ మిగ‌తా వాళ్లూ చేస్తూ త‌మ ఆనందాన్ని ఇత‌రుల‌తో పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో నెట్టింట ర‌చ్చ లేపుతుంది. వివ‌రాల్లోకి వెళితే

మంచు ల‌క్ష్మి(Manchu Lakshmi) మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప‌రిచ‌యం అవ‌స‌ర‌మే లేని వ్య‌క్తి . అమె తన మాట‌లు చేత‌ల‌తో ఎప్పుడు సోష‌ల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూ వ‌స్తుంది. తాజాగా మంచు ల‌క్ష్మి క్ర‌యోథెర‌ఫీ (cryo therapy)లో భాగంగా ఫిన్‌లాండ్‌లో స్విమ్‌సూట్ ధరించి గ‌డ్డ క‌ట్టిన నీళ్ల‌లోకి దిగిన వీడియో సోష‌ల్‌మీడియాను బాగా షేక్ చేస్తుంది. కొద్దిసేప‌టి క్రిత‌మే త‌న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ వీడియో పోస్టు చేయ‌గా నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. మ‌రికొంత‌మంది ఆవ‌న్నీ మ‌న‌కు అవ‌స‌ర‌మా అక్కా అంటూ విమ‌ర్శ‌లు సైతం చేస్తున్నారు.


గతంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌జ్ఞా జైశ్వాల్ వంటి తార‌లు చాలామంది గ‌డ్డ‌క‌ట్టిన నీళ్ల‌లోకి దిగి వేరే వారికి ఛాలెంజ్ విసర‌డం వారు కూడా ఇలాగే నీళ్ల‌లోకి దిగ‌డం వంటివి చేస్తూ ఆ వీడియోల‌ను సోష‌ల్‌మీడియాల్లో చేసే వారు. దీంతో ఆ వీడియోలు కొద్ది రోజుల పాటు వైర‌ల్ అవుతూ వారిని వార్త‌ల్లో నిలిపేవి. ప్ర‌తి రెండు మూడు నెల‌ల‌కొక‌రు ఇలాంటి వీడియోలు పెట్ట‌డం అవి ట్రెండింగ్ అవ‌డం అన‌వాయితీగా మారుతూ వ‌స్తుంది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-12-17T15:24:02+05:30 IST