Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ హ్యాపీ, మిస్ యూనివర్స్ పోటీలకు తయారవుతోందా, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-07-04T17:52:22+05:30 IST

సూపర్ స్టార్ మహేష్, నమ్రత ల ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే ఆమెకి స్టార్ డమ్ వచ్చేసింది, అలాగే ఆమె ఒక యాడ్ లో కూడా నటించింది. ఇప్పుడు ఆమె గోల్ ఏంటంటే...

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ హ్యాపీ, మిస్ యూనివర్స్ పోటీలకు తయారవుతోందా, ఫోటోస్ వైరల్
Sitara Ghattamaneni photos display at TImes Square, New York

చిత్ర పరిశ్రమలో చాలామంది స్టార్స్ తాలూకా కుమారులను, కుమార్తెలను చూస్తున్నాం. అయితే చాలా చిన్న వయసులోనే ఒక స్టార్ డమ్ తెచ్చుకున్నది ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క మహేష్ (MaheshBabu), నమ్రతల (NamrathaShirodkar) కుమార్తె సితార ఘట్టమనేని (SitaraGhattamaneni). ఇంకా ఆమెకి పదకొండేళ్ళ కూడా సరిగా లేవు, కానీ అప్పుడే ఒక బంగారం షాపుకి బ్రాండ్ అంబాసడర్ గా చేసేసింది. అది కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఆమె చేసిన ఆ బంగారం యాడ్ ని చూపించడం ఇంకో విడ్డూరం. బహుశా బాలీవుడ్ లో కూడా చాలామంది స్టార్ కిడ్స్ వున్నారు కానీ వాళ్ళకి కూడా ఇంత చిన్న వయసులో ఎవరికీ స్టార్ డమ్ రాలేదు.

sitaraghattamaneni3.jpg

మహేష్ బాబు తన కుమార్తె ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయిందని అంటూ వుంటారు. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానంలో, ముఖ్యంగా ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సెంట్ (AmericanAccent) ఉంటుంది. అయితే ఆలా మాట్లాడమని మేము ఎప్పుడూ చెప్పలేదు, ఆమెకి అది స్వతహాగానే వచ్చింది అని చెప్తారు మహేష్ తన కుమార్తె గురించి.

సితార ఇప్పుడు యూట్యూబ్ లో స్టార్, ఇన్స్టాగ్రామ్ లో స్టార్, సాంఘీక మాధ్యమాల్లో కూడా ఆమె పేరు ట్రేండింగ్ అవుతూ ఉంటుంది. ఆమె శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకుంటోంది. ఆ వీడియోస్ కూడా అప్పుడప్పుడూ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అవి కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆమెకి ఫాలోవర్లు కూడా ఒక మిలియన్ దాటి వున్నారు. సినిమాలు ఏమీ చెయ్యకుండానే ఆమె ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అయిపోయింది అనే చెప్పాలి.

sitaraghattamaneni4.jpg

అయితే సితార ఆలా అన్నీ నేర్చుకొని ఒక సూపర్ కిడ్ లా తయారవటానికి ఆమె తల్లి నమ్రతా కృషి కూడా చాలా వుంది. ఎందుకంటే సితార చిన్నప్పటి నుండి ఆమెకి నృత్యం లోనూ, హావ భావాలలోనూ ఇలా అన్నిటిమీద కమాండ్ రావటానికి ట్యూషన్ మాస్టర్స్ ని పెట్టి సితారకి వాటిమీద ఆసక్తి కలిగేట్టు చేశారు నమ్రత.

ఇప్పుడు అటు పరిశ్రమలోనూ, ఇటు బయట, ఇంకా మహేష్ బాబు అభిమానుల్లో ఒకటే వార్త తచ్చాడుతోంది. సితారని మిస్ యూనివర్స్ (MissUniverse), మిస్ వరల్డ్ (MissWorld) పోటీలకు నమ్రత సిద్ధం చేస్తోంది అని, ఆ తరువాత ఏదైనా హాలీవుడ్ లేదా బాలీవుడ్ సినిమాలో ఆమెని పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారని ఒక వార్త నడుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే అటువంటి పోటీలకు ఇప్పటినుండే తయారు చెయ్యాలి అని కూడా కొందరు అంటున్నారు. సితారకి ఇంకా పది పదకొండేళ్లు మాత్రమే, ఇంకొక ఆరు ఏడేళ్లు తర్వాత మాత్రమే ఆమె పాల్గొంటుంది అని అంటున్నారు.

sitaraghattamaneni5.jpg

అయితే అలాంటి పోటీలకు ఇప్పటి నుండే తర్ఫీదు ఇవ్వాలని, బాలీవుడ్ లో కూడా చాలామంది స్టార్ కుమార్తెలు హిందీ సినిమాలలో ఆరంగేట్రం చెయ్యడం కోసం చిన్నప్పటి నుండే తర్ఫీదు ఇస్తారని అంటున్నారు. అయితే సితారకి వాళ్ళకీ తేడా ఏంటంటే, సితార ఇప్పటికే ఒక పెద్ద స్టార్ అయిపొయింది. ఇప్పుడు ఈ యాడ్ తో ఆమె మరింత పాపులర్ అవ్వటం ఖాయం. మామూలుగా అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కుమారులు స్టార్స్ అవుతారు, కానీ మహేష్, నమ్రతలు తమ కుమార్తెని ఇలా ప్రోత్సహించటం ఆమె ఇప్పటికే సూపర్ స్టార్ అవటం మిగతా వాళ్ళకి కూడా స్ఫూర్తిదాయంగా ఉంటుంది అని పరిశ్రమలో అంటున్నారు.

Updated Date - 2023-07-04T17:52:22+05:30 IST