Hyper Aadi: రవితేజ ప్రయోగాల వల్లే.. హరీష్ శంకర్, బాబీ, మలినేని గోపీచంద్ వచ్చారు

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:23 PM

‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్ ని మంగళవారం గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్‌కు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ..

Hyper Aadi: రవితేజ ప్రయోగాల వల్లే.. హరీష్ శంకర్, బాబీ, మలినేని గోపీచంద్ వచ్చారు
hyper aadhi

మాస్ మహారాజా రవితేజ (Raviteja) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’ (Dhamaka). శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ తాజా చిత్రం ‘ఈగల్‌’(Eagle) 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ (Dhamaka) టీమ్‌కు మెమెంటోలు అందజేశారు.


హైపర్ ఆది (Hyper Aadi) మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే మొన్ననే ధమాకా విడుదలై ఇప్పుడు సక్సెస్ మీట్ జరిగినట్లు అనిపిస్తోంది. రవితేజ (Raviteja) గారికి ఆయన స్టయిల్‌లో ఎంటర్టైన్ మెంట్ పడితే ప్రేక్షకులు వంద కోట్లతో ఆశీర్వదించారు. రవితేజ (Raviteja) గారు ఆయన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రూఫ్ చేసుకోవడానికి భిన్నమైన కథలు చేస్తుంటారు.

రవితేజ (Raviteja) గారు చేసిన ప్రయోగాలు వలనే హరీష్ శంకర్, బాబీ, మలినేని గోపీచంద్ లాంటి డైనమిక్ డైరెక్టర్స్ వచ్చారు. ఆయన ఎంతోమంది ప్రతిభావంతులని వెలుగులోకి తెచ్చారు. రవితేజ గారు ఒక తరానికి వినోదం పంచిన హీరో మాత్రమే కాదు ఒక తరానికి స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి. అలాంటి రవితేజ (Raviteja) గారితో ధమాకా (Dhamaka) సినిమాలో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘ఈగల్’(Eagle) చిత్రం కూడా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’ అన్నారు. ఈ వేడుకలో ధమాకా (Dhamaka) , ఈగల్ చిత్రాల యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 09:52 AM