VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్

ABN , First Publish Date - 2023-05-09T17:17:58+05:30 IST

తాజాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) (Vijay Deverakonda Birthday Special) పురస్కరించుకుని.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ (Special Poster)ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసి..

VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్
VD12 Special Pic

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా.. ‘మళ్ళీ రావా’ (Malli Raava), ‘జెర్సీ’ (Jersey) చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రీసెంట్‌గా సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) (Vijay Deverakonda Birthday Special) పురస్కరించుకుని.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ (Special Poster)ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ యమా ఖుష్ అవుతున్నారు.

ఎందుకంటే.. ఈ పోస్టర్ చాలా క్రియేటివ్‌గా ఉంది. పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై కథానాయకుడి రూపం కనిపించడం ఆకట్టుకుంటోంది. కథానాయకుడి కళ్ళలో ఇంటెన్స్ కనిపిస్తోంది. అలాగే పోస్టర్ పై ‘‘I don’t know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy’’ అని రాసుంది. పోస్టర్‌ను రూపొందించిన తీరు చూస్తుంటే సినిమా చాలా కొత్తగా ఉండబోతుందనేది మాత్రం అర్థమవుతోంది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్.. పరాజయాల్లో ఉన్న విజయ్‌ని మళ్లీ ఈ చిత్రం.. ఎక్కడికో తీసుకెళుతుందనే నమ్మకాన్ని ఈ పోస్టర్ ఇస్తుందని తెలుపుతూ.. లైక్స్‌తో తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. (VD12 Special Poster)

Sreeleela.jpg

గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జెర్సీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళును రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడీ కాంబినేషన్‌కు పాన్ ఇండియా (Pan India) ఇమేజ్ ఉన్న విజయ దేవరకొండ, టాలీవుడ్ క్రష్ శ్రీలీల తోడవడంతో.. సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం కూడా నమ్మకంగా చెబుతోంది. కాగా.. ‘జెర్సీ’లో తన సంగీతంతో కట్టిపడేసిన అనిరుధ్‌ రవిచందర్‌ (Anirudh Ravichander) ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ ప్రారంభం కానుంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..

*PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?

*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..

*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్

*Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..

*OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్‌ నుంచి ఊహించని ట్వీట్

Updated Date - 2023-05-09T17:17:58+05:30 IST